National Pension Scheme: దేశంలో చాలా మంది తన డబ్బును దాచుకునేందుకు, భవిష్యత్తు పెన్షన్ ప్లానింగ్ కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో డబ్బుకు పూర్తిగా ప్రభుత్వ హామీ, భద్రత ఉంటుంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) నేషనల్ పెన్షన్ స్కీమ్‌కి సంబంధించిన కొన్ని నియమాల్లో ముఖ్యమైన మార్పులు చేసింది. ఇప్పుడు పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన మొత్తంలో 60 శాతం వరకు నెలవారీ/త్రైమాసికం/అర్ధ సంవత్సరం లేదా ఏటా విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. పదవీ విరమణ తర్వాత ప్రజల నెలవారీ అవసరాలను మెరుగ్గా తీర్చేందుకు వీలుగా ఈ మార్పు చేయబడింది.

అక్టోబర్ 25న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా డబ్బును ఉపసంహరించుకోవాలనుకునే ఖాతాదారుల వివరాలను వారి బ్యాంక్ వివరాలతో సరిపోల్చి ఆ తర్వాత వారు డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారుల భద్రత పెంచబడుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే డబ్బును ఉపసంహరించుకోవటం కుదరదు. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండానే వెరిఫికేషన్ ప్రక్రియ ఫెయిల్ అయితే CRA సంస్థ సదరు ఫిర్యాదును సంబంధింత నోడల్ అధికారికి పంపబడుతుంది. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేసి ప్రాసెస్ పూర్తి చేయబడుతుంది.
ఎన్‌పీఎస్‌తో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఇది మోదీ ప్రభుత్వ దీపావళి కానుక అని నిపుణులు అన్నారు. NPS ద్వారా 60 ఏళ్ల తర్వాత 75 సంవత్సరాల వయస్సు వరకు, ప్రతి నెలా సుమారు 10,000 రూపాయల ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు మూలధనం డిపాజిట్ లిమిట్ రూ.1.5 కోట్ల నుంచి రూ.2.50 కోట్లకు పెంచింది.


Click it and Unblock the Notifications