Onion Exports: శనివారం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై గతంలో ప్రకటించిన బ్యాన్ ఎత్తివేసింది. మహారాష్ట్రలో కీలక లోక్ సభ ఎన్నికలు రెండవ దశ ముందు నిర్ణయం వచ్చింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఉల్లి సాగును చేస్తుంటారు.
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) ఉల్లిపాయ కనీస ఎగుమతి ధర టన్నుకు $550గా నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ.. ప్రభుత్వం బంగళాదేశ్, శ్రీలంక, యూఏఈ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం పరిమిత ఎగుమతులను అనుమతించింది. తమ పంటకు మంచి ధర వస్తుందని ఎగుమతులకు మోదీ సర్కార్ అనుమతించాలని ఉల్లి రైతులు, వ్యాపారులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శనగలు ఉత్పత్తి తగ్గుదల సూచలన మధ్య దిగుమతి సుంకం నుంచి మార్చి 2025 వరకు మినహాయింపు ప్రకటించబడింది. గత నెలలో చనా ధరలు దిల్లీలో గత నెలలో క్వింటాల్ ధర రూ.5,700తో పోలిస్తే 10% కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ.6,300కి చేరుకున్నాయి.

ఇదే క్రమంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత రైతుల కళ్లల్లో మోదీ సర్కార్ మట్టికొట్టడమేనని స్వాభిమాని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ జగ్తాప్ అన్నారు. నిషేధం ఎత్తివేసినట్లు కనిపిస్తున్నా ఎగుమతి సుంకం కొనసాగించటాన్ని తప్పుపట్టారు. నేపథ్యంలో మహారాష్ట్రలో ఉల్లిగడ్డపై ప్రజాభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. అందుకే భయంతో బీజేపీ ప్రభుత్వం రైతులను వెర్రివాళ్లను చేసేందుకు ఉల్లి ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేత వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం రైతులకు అనుకూలంగా లేదని, ఉల్లి ధరలు పాతాళానికి పడిపోయాయని సందీప్ జగ్తాప్ అన్నారు. ఎర్ర ఉల్లిని పూర్తిగా గిట్టుబాటు ధరకే విక్రయిస్తున్నారని, ఇప్పుడు వేసవిలో ఉల్లిని సగం మంది రైతులు విక్రయించారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం రైతులకు మేలు చేయదని చెప్పారు. ఇది ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని జగ్తాప్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఎగుమతి సుంకాన్ని తొలగించాలని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications