birth certificate: ఇకపై అన్నింటికీ ఒకే ధృవీకరణగా బర్త్ సర్టిఫికేట్.. ఎక్కడెక్కడ వాడొచ్చంటే..
birth certificate: ఏ చిన్న పని కావాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డు కావాల్సి వస్తోంది. ఇప్పటివరకు కొన్నిచోట్ల మాత్రమే ఉపయోగిస్తున్న బర్త్ సర్టిఫికెట్.. ఇక మీదట అన్నింటికీ అవసరం కానుంది. ఈ మేరకు లోక్ సభలో మోదీ సర్కారు బిల్లును సైతం ప్రవేశపెట్టింది. దీనిపై వ్యతికేకత సైతం వ్యక్తమవుతోంది.
విద్యా సంస్థల్లో ప్రవేశం సహా ప్రభుత్వ ఉద్యోగం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వివాహ నమోదు, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్ పొందడం కోసం బర్త్ సర్టిఫికేట్ ను అనుమతించనున్నారు. ఇందుకు అనుగుణంగా జనన, మరణాల నమోదు చట్టానికి సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లు ప్రవేశపెట్టారు.

జాతీయ, రాష్ట్ర స్థాయి జనన, మరణాల డేటాబేస్ రూపొందించడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక పాలన అందించడంతో పాటు డిజిటలీకరణ సాధ్యమవుతుందని చెబుతోంది. సంక్షేమ పథకాలు, అందుకు తగిన విధంగా నిధుల కేటాయింపులు చేయవచ్చని అంచనా వేస్తోంది.
అయితే కాంగ్రెస్ MP మనీష్ తివారీ ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. లోక్ సభకు అలా చేసే సామర్థ్యం లేదన్నారు. ఈ బిల్లు ప్రజల గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని తెలిపారు. కానీ చివరికి బిల్లు వాయిస్ ఓటు ద్వారా ప్రవేశపెట్టబడింది. రానున్న రోజుల్లో దీనిపై చర్చ జరగనుంది.


Click it and Unblock the Notifications