Scrap Sale: ఇటీవల భారత అంతరీక్ష పరిశోధన సంస్థ ఇస్రో దాదాపు రూ.600 కోట్లు వెచ్చించి చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. దీనిపై కొన్ని పాశ్చాత్య దేశీల మీడియా ఎందుకింత ఖర్చుతో ఇండియాకు ప్రయోగాలంటూ విష ప్రచారం చేసింది.
అయితే కేవలం రెండున్న నెలల్లో కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్-3 బడ్జెట్ మెుత్తాన్ని తిరిగి సంపాదించింది. మోదీ సర్కార్ పాత ఫైళ్లు, పాత ఆఫీస్ ఫర్నిచర్, చిత్తు కాగితాలు, పాత వాహనాలను విక్రయించడం ద్వారా కేవలం ఒకటిన్నర నెలల కాలంలో రూ.600 కోట్ల ఆదాయాన్ని పొందింది. అక్టోబర్ నెలాఖరు నాటికి స్క్రాప్ సేల్ ద్వారా రూ.1,000 కోట్లను ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ప్రచార 3.0ని ప్రారంభించనుంది. పరిశుభ్రతపై దృష్టి పెట్టడమే ఈ ప్రచారం లక్ష్యం. గత ఏడాది కూడా ఇదే తరహా ప్రచారం నిర్వహించి రూ.371 కోట్లను రాబట్టినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఈ ఏడాది అమలు ద్వారా మెుత్తం రూ.400 కోట్లు వస్తుందని అంచనా వేయబడింది. ఈ ప్రచారం మెుదటి దశలో రూ.62 కోట్లు వచ్చాయి. అలాగే స్వచ్ఛత ప్రచారం ద్వారా నెలకు రూ.20 కోట్లు ఆర్జించాలని చూస్తోంది.
గతేడాది అక్టోబరులో చేపట్టిన ప్రచారంలో 90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని క్లియర్ చేశారు. ఈ ఏడాది 100 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మూడో దశ ప్రచారంలో.. అన్ని మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సెప్టెంబర్ 14న ఢిల్లీ నుంచి ప్రచారాన్ని ప్రకటించనున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications