PM Modi: ఈసారి మూడోసారి అధికారంలోకి రాగానే అత్యధిక ప్రాధాన్యత ఉద్యోగాల కల్పన, యువతకు నైపుణ్యం, వ్యవసాయం, మధ్యతరగతి ప్రజలతో పాటు పెన్షనర్లు వంటి అనేక అంశాలపై తన దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే మరో శుభవార్త కూడా ఉంది.
కనీస నెలవారీ పెన్షన్‌ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న లక్షలాది మందికి ప్రస్తుతం ఒక శుభవార్త ఉంది. అధిక పెన్షన్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని మోదీ సర్కార్ హామీ ఇచ్చిందని పెన్షనర్ల సంస్థ EPS-95 నేషనల్ మూవ్‌మెంట్ కమిటీ శుక్రవారం తెలిపింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని తెలుస్తోంది.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్య తమ ప్రతినిధులను కలిశారని పెన్షనర్ల సంఘం వెల్లడించింది. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొంది. EPS-95 స్కీమ్‌లోని 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలని డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచారు. దిల్లీలో EPS-95 NAC సభ్యులు నిర్వహించిన నిరసన తర్వాత మన్సుఖ్ మాండవియాతో సమావేశం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
తమ సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వం తీవ్రంగా ఉందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మాకు హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ వెల్లడించారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రధాన మంత్రి కూడా కట్టుబడి ఉన్నారని, సాధారణ పెన్షన్ ఫండ్‌కు దీర్ఘకాలిక విరాళాలు ఇస్తున్నప్పటికీ, పింఛనుదారులకు పింఛను చాలా తక్కువ అని అన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న పింఛను కారణంగా వృద్ధ దంపతుల జీవనం కూడా కష్టతరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. డిమాండ్లలో పెన్షనర్ జీవిత భాగస్వామికి డియర్‌నెస్ అలవెన్స్, ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిశారని రౌత్ తెలిపారు.


Click it and Unblock the Notifications