షాకింగ్ న్యూస్.. రూ.2000లోపు డిజిటల్ చెల్లింపులపై 18% జీఎస్టీ..! ఎవరికి నష్టం..?
Digital Payments: త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రూ.2000 లోపు జరిపే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డిజిటల్ చెల్లింపులపై జీఎస్టీ వసూలు చేయాలని కేంద్రం చూస్తున్నట్లు వార్తా నివేదికలు సాధారణ చెల్లింపుదారులను ఆందోళన కలిగిస్తోంది.
CNBC-TV18 నివేదిక ప్రకారం చిన్న చిన్న లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల చిరు వ్యాపారులపై పెను ప్రభావం పడుతుందని పేర్కొంది. 2016లో డీమానిటైజేషన్ తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందుకే దేశంలో 2016 నుంచి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల వినియోగం గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.2000 కంటే తక్కువ ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై సేవా పన్నును కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో భారతీయ ప్రజలు డిజిటల్ లావాదేవీలకు మారారు.

అయితే 2017లో మోదీ ప్రభుత్వం భారతదేశంలో జీఎస్టీని వ్యాట్ స్థానంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే GST కౌన్సిల్ సమావేశంలో రూ.2000 లోపు చెల్లింపులపై జీఎస్టీ పన్నును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రేజర్ పే, అమెజాన్ పే, జస్ పే వంటి పేమెంట్ గేట్‌వే సైట్‌లు ప్రతి లావాదేవీకి 0.5 శాతం నుంచి 2 శాతం మధ్య వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుముపై కొత్తగా కేంద్రం జీఎస్టీ విధించనున్నట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే వ్యాపారులపైనే ఈ పన్ను పరోక్షంగా ఉంటుంది కాబట్టి సాధారణ వినియోగదారులకు తమ చెల్లింపులపై ఎలాంటి అదనపు ఖర్చులు ఉండని చెప్పుకోవచ్చు.
పేమెంట్ గేట్ వే కంపెనీలు వ్యాపారులపై కేంద్రం జీఎస్టీని ప్రవేశపెడితే ప్రధానంగా చిన్న వ్యాపారులు ప్రభావితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో పేమెంట్ గేట్ వే కంపెనీలు రూ.1000 లావాదేవీపై వ్యాపారి నుంచి 1 శాతం గేట్‌వే రుసుము వసూలు చేస్తున్నాయి. అంటే రూ.1000 లావాదేవీకి రూ.10 వ్యాపారులు పేమెంట్ గేట్‌వే కంపెనీకి చెల్లిస్తాయి. అయితే దీనిపై కేంద్రం కొత్తగా 18 శాతం జీఎస్టీని ప్రవేశపెడితే ఈ ఖర్చు సదరు వ్యాపారికి రూ.11.80కి పెరగనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications