India Tariff Cuts: ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తీరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెుహమాట పడకుండానే ఎండగట్టారు. ప్రపంచంలో అత్యధిక పన్నులు విధిస్తున్న దేశంగా ఇండియానని ఆయన పేర్కొన్నారు. వ్యాపారం చేయటం దీంతో క్లిష్టతరంగి మారిందన్నారు. అమెరికా ఉత్పత్తులపై పన్నులు వేస్తున్న దేశాలు కూడా అదేవిధమైన టారిఫ్స్ చూడనున్నట్లు ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేసిన తాజా కామెంట్స్ చేసిన క్రమంలో మోదీ సర్కార్ కూడా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో దేశంలోని బోర్సన్ విస్కీ ప్రియులకు పెద్ద శుభవార్త వచ్చేసింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ విస్కీపై ఇప్పటి వరకు ఇండియా 150 శాతం సుంకాన్ని విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత వాణిజ్య సుంకాలపై చేసిన తాజా విమర్శల తర్వాత ఇండియా సుంకాన్ని ఈ విస్కీపై 100 శాతానికి తగ్గించటం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు జిమ్ బీమ్ వంటి బ్రాండ్లకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికా పర్యటన ఇటీవల కొనసాగింది. ఈ క్రమంలో ట్రంప్ భారతదేశంలో అమెరికన్ వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించారు. అమెరికన్ వస్తువులపై సుంకాలు విధించే దేశాలపై పరస్పర సుంకాల వేసేందుకు ప్రతిపాదనను ట్రంప్ వ్యక్తం చేయటం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా నిర్ణయంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే బోర్బన్ విస్కీపై 50 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీతో పాటు మరో 50 శాతం లెవీ ఉంటుందని భారత ప్రభుత్వం ఈనెల 13న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం వెల్లడైంది. దీంతో గతంలో 150 శాతం వద్ద ఉన్న పన్నులు ప్రస్తుతం 100 శాతానికి తగ్గించబడ్డాయి.
ఇదే క్రమంలో ఇతర ఆల్కహాల్ దిగుమతులపై భారత ప్రభుత్వం తన 150 శాతం సుంకాలను కొనసాగిస్తూనే ఉంది. డయాజియో మరియు పెర్నోడ్ రికార్డ్ వంటి అంతర్జాతీయ మద్యం దిగ్గజాలు భారతదేశంలో 35 బిలియన్ డాలర్ల స్పిరిట్స్ మార్కెట్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన విస్తృత వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాల తగ్గింపు ప్రకటించబడింది. భారత్ మోదీ పర్యటన తర్వాత భారత్ అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాలను సర్థుబాటు చేసే పనిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది అర్థవంతమైన వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేసింది. భారతదేశం దిగుమతి చేసుకున్న విస్కీ మార్కెట్‌లో అమెరికన్ బోర్బన్ విస్కీ 25% వాటా కలిగి ఉండటం గమనార్హం.
ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ప్రధాని మోదీ తన కంటే చాలా కఠినమైన నెగోషియేటర్ అని అభిప్రాయపడ్డారు. ఆయనతో తాను పోటీ కూడా లేదంటూనే భారత సుంకాలపై ఏకరువు పెట్టారు. అమెరికన్ స్పిరిట్ బోర్బన్ విస్కీని కనీసం 51% మొక్కజొన్న నుండి తయారు చేస్తారు. పైగా ఈ విస్కీని కాల్చిన ఓక్ బారెల్స్‌లో కొన్నాళ్లు స్టోర్ చేయటం ద్వారా తేలికపాటి తీపి రుచిని అందిస్తుంది. 1964లో యూఎస్ కాంగ్రెస్ ద్వారా "యునైటెడ్ స్టేట్స్ విలక్షణమైన ఉత్పత్తి"గా గుర్తించబడిన బోర్బన్ కెంటుకీ, టేనస్సీ వంటి రాష్ట్రాల సాంస్కృతిక గుర్తింపుగా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications