Ayushman Bharat Yojana: మోదీ సర్కార్ వరుసగా మూడోసారి ఎన్నికైన తర్వాత వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే వృద్ధులకు ఉచితంగా చికిత్స పొందేందుకు పెద్ద అవకాశాన్ని తీసుకొస్తోంది.
ఇకపై దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం ఉచితంగా ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో వారికి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వీరిని తీసుకురావాలని మోదీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడు 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరూ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం కింద కవర్ చేయబడనున్నారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య కవరేజీని ఎన్డీఏ కేబినెట్ ఆమోదించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ యోజన కింద సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబం ఇప్పటికే ఆయుష్మాన్ కింద కవర్ చేయబడి.. వారి కుటుంబంలో ఒక సభ్యుడు 70 ఏళ్లు పైబడి ఉన్నట్లయితే రూ.5 లక్షల అదనపు కవరేజీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మోదీ సర్కార్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో దేశంలో దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు 5 లక్షల రూపాయల విలువైన ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ కవరేజీ లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ప్రత్యేక కార్డును అందజేస్తామని మోదీ ప్రభుత్వం తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications