Online Frauds: ఆన్‌లైన్ మోసాల ద్వారా డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు లేదా పొరపాటున వేరొకరి ఖాతాకు డబ్బు పంపిన వ్యక్తులకు త్వరలోనే పెద్ద ఉపశమనం లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందుకోసం బ్యాంకుల సహకారంతో కొత్త మార్గదర్శకాలను సిద్ధమౌతున్నాయి.
త్వరలో రానున్న మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థలకు వేగంగా చర్యలు చేపట్టడానికి మార్గం సుగమం చేయనుంది. ఇందుకోసం త్వరలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవసరమైన ప్రామాణిక ఫార్మాట్ గురించి సమాచారాన్ని త్వరలోనే పంచుకుంటాయని వెల్లడైంది. దీనికి సంబంధించి ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆర్థిక సేవల విభాగం ఉన్నత స్థాయి చర్యలు జరిగాయి. సైబర్ ఆర్థిక మోసాలలో విత్‌డ్రా చేసిన డబ్బును కస్టమర్‌లకు తిరిగి ఇచ్చేలా బ్యాంకులకు సహాయం చేయడానికి బ్యాంకులతో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల రూపకల్పనపై చర్చలు జరిగాయి.

ఇప్పటి వరకు దీనికి సంబంధించి డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు ఎలాంటి ఎస్ఓపీ లేకపోవటం గమనార్హం. కొత్త SOP వల్ల బ్యాంకులు, దర్యాప్తు సంస్థల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మోసం జరిగితే డబ్బు సులభంగా కనుగొనటంతో పాటు రికవరీ చేయబడుతుంది. మోసానికి సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం 24 గంటలూ నోడల్ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకుల కేంద్రం కోరింది.
ఆన్‌లైన్ మోసం బారిన పడినప్పుడు ముందుగా బాధితులు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఈ జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి సులువుగా సమస్యను నమోదు చేయవచ్చు. కాల్ చేసిన సమయంలో బాధితులు తమ పేరు, సంప్రదింపు వివరాలు, వ్యక్తిగత ఖాతా వివరాలు, డబ్బు బదిలీ చేయబడిన ఖాతా వివరాలు వంటి అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications