న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. టెల్కోలకు ఊరట నుంచి మొదలు ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి కొన్ని నిబంధనలు చేర్చారు. వీటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.

ఫిక్స్డ్ టర్మ్ కార్మికులు
ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి కొన్ని నిబంధనలను చేర్చారు. ప్రయోజనాల వరకు స్థిర కాల వ్యవధి (ఫిక్స్డ్ టర్మ్)పై పని చేస్తున్న కార్మికులను కూడా శాశ్వత కార్మికులతో సమానంగా పరిగణిస్తారు. ఇది ఎంతోమంది ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు శుభవార్త.

అలా నియమించుకోవచ్చు
ఇండస్ట్రియల్ రిలేషన్ 2019 లేబర్ కోడ్ ప్రకారం కంపెనీలు ఫిక్స్డ్ టర్మ్ పైన ఎంత కాలమైనా వర్కర్క్స్‌ను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. స్థిర కాల ఉపాధి అంటే సీజన్ మరియు ఆర్డర్స్‌ను బట్టి ఒక కార్మికుడిని మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు నియమించుకోవచ్చు.

సాధారణ ఉద్యోగులతో సమానంగా చూడాలి..
ఫిక్స్డ్ టర్మ్‌కు ఉద్యోగులను ఇదివరకటి లాగే నియమించుకున్నప్పటికీ వీరిని కూడా శాశ్వత లేదా సాధారణ కార్మికులతో సమానంగా చూడాలి. కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కోడ్ ప్రకారం వన్ మెంబర్ ట్రైబ్యునల్‌కు బదులు టూ మెంబర్ ట్రైబ్యునల్ ఏర్పాటు ఉంటుంది. ముఖ్యమైన కేసులో జాయింట్‌గా, మిగతావి సింగిల్‌గా తీర్పు చెబుతారు.

డిగ్నిటీ ఆఫ్ లేబర్
ఏ రంగంలోనేనా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను తీసుకోవచ్చు. సాధారణ ఉద్యోగుల్లాగే వీరికి వేతనాలు, ఇతర బెనిఫిట్స్ ఉండాలి. డిస్ప్యూట్స్‌కు టూ మెంబర్ ట్రైబ్యునల్. కాగా, కార్మికుల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రకాల సంస్కరణలు తీసుకు వస్తోంది.

కేబినెట్ మరిన్ని కీలక నిర్ణయాలు
- భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలలో ప్రభుత్వ వాటాల విక్రయం.
- ఏదైనా ప్రయివేటు సంస్థకు అనుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సవాల్ చేసి ఉండి, ఇంతవరకు ఆర్బిట్రేషన్ మొత్తం చెల్లించకుంటే ఇప్పుడు అందులో 75 శాతం మొత్తాన్ని ప్రయివేటు సంస్థకు చెల్లించాలని నిర్ణయం.
- ప్రభుత్వ వ్యయంతో చేపట్టిన జాతీయ రోడ్ల నిర్మాణం పూర్తయి, ఏడాతి కాలంగా టోల్ వసూలు చేస్తుంటే వాటిని టోల్ ఆపరేట్ ట్రాన్సుఫర్ విధానానికి మార్చుకోవచ్చు. ఇదివరకు రెండేళ్లు ఉండేది. ప్రాజెక్టును బట్టి టారిఫ్ వసూలు వ్యవధిని 15-30 ఏళ్ల మధ్యలో నిర్ణయించవచ్చు.
- కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించేందుకు గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు
- విదేశాల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతికి కేబినెట్ ఆమోదం
- ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెల్కోలకు ఊరట. స్పెక్ట్రం చెల్లింపుపై రెండోళ్ల పాటు మారటోరియం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications