PM Awas Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడోసారి సామాన్య ప్రజలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే రైతుల కోసం పలు నిర్ణయాలను ఇటీవలి వార్షిక బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బడ్జెట్ పీఎం ఆవాస్ యోజనకు సైతం కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే.
నేడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0కి ప్రధాని మోదీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్కీమ్ కింద రానున్న ఐదేళ్ల కాలంలో పట్టణ ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్ల నిర్మాణం లేదా కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. దేశంలోని పట్టణాల్లో నివశిస్తున్న దాదాపు కోటి మంది పేద మధ్యతరగతి కుటుంబాలు తాజా నిర్ణయం వల్ల లబ్ధిపొందనున్నాయి. పథకం పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

పీఎంఏవై కింద మైదాన ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి కొండ ప్రాంతాల్లోని లబ్ధిదారులు రూ.1.3 లక్షలు పొందుతారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రూ.10 లక్షల కోట్ల ఖర్చు చేయనుంది. అయితే ఇందులో రూ.2.3 లక్షల కోట్ల ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. PMAY-U ప్రారంభ దశలో మొత్తం 1.18 కోట్ల గృహాలకు అనుమతి ఇవ్వబడింది. వీటిలో 85.5 లక్షలకు పైగా గృహాలు విజయవంతంగా ఇప్పటికే నిర్మించడి అర్హులైన లబ్ధిదారులకు అందించబడ్డాయి.
EWS కుటుంబాలు అంటే వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉన్న కుటుంబాలు. గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ తన ప్రసంగంలో నగరాల్లో నివసించే బడుగు బలహీన వర్గాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇంటి కలలు కంటున్నారని, వారి కలను తమ ప్రభుత్వం నెరవేర్చబోతోందని అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు దానికి అనుగుణంగానే మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications