Drone Scheme: ఎన్నికల దగ్గర పడుతున్న వేళ దేశంలో మహిళ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వారికి డ్రోన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు.
నయా పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2023-24 నుంచి 2025-2026 మధ్య కాలంలో ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు వ్యవసాయంలో వినియోగంలో వినియోగించే డ్లోన్లను అందించటం జరుగుతుంది. వీటిని సదరు మహిళలు తమ ప్రాంతంలోని రైతులకు అద్దెకు ఇచ్చేందుకు వీలుగా పథకాన్ని రూపొందించారు.

ఈ స్కీమ్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,261 కోట్లను ఆమోదించినట్లు మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కీమ్ ద్వారా 15,000 స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన వ్యాపారం, జీవనోపాధిని అందించగలవని, ఏడాదికి లక్ష రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందేందుకు ఇది సహాయపుతుందని క్యాబినెట్ అభిప్రాయపడింది. అలాగే వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి పంట దిగుబడిని పెంచే క్రమంలో స్కీమ్ రూపొందించబడినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ఇది రైతులక ఖర్చులను తగ్గిస్తుందని వారు పేర్కొన్నారు.
స్కీమ్ కింద డ్రోన్‌ల కొనుగోలు కోసం మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ధరలో 80%, ఉపకరణాలు/అనుబంధ ఛార్జీల్లో గరిష్టంగా రూ.8 లక్షల వరకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలిన మెుత్తాన్ని నేషనల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (AIF) నుంచి రుణం రూపంలో పొందవచ్చని తెలుస్తోంది. లోన్ పై 3 శాతం వడ్డీ రాయితీ అందించబడుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications