MSP Hike: దీపావళికి ముందే రైతుల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో 6 రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయించింది.
మోదీ సర్కార్ నిర్ణయం నిజంగా రైతులకు పెద్ద పండుగ బహుమతి అని చెప్పుకోవాలి. రబీ పంటలపై ఎంఎస్‌పీని 2-7 శాతానికి పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాన రబీ పంటలైన గోధుమలు, బంగాళదుంపలు, శనగలు, కాయధాన్యాలు, లిన్సీడ్, బఠానీ, ఆవాలు సాగుచేసే రైతులు తాజా పెంపుతో లాభపడనున్నారు.

నూనెగింజలు, ఆవాలు క్వింటాల్‌కు రూ.200, కందులపై క్వింటాల్‌కు రూ.425, గోధుమలు క్వింటాల్‌కు రూ.150, బార్లీ క్వింటాల్‌కు రూ.115, పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.150, మినుము క్వింటాల్‌కు రూ.105, జొన్నలపై క్వింటాల్‌కు రూ.150 పెంపుకు మోదీ సర్కార్ నిర్ణయించినట్లు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని 1.5 రెట్లు పెంచడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 6 రబీ పంటలకు MSP ఎక్కువగా ఉందని అన్నారు.
MSP అంటే ఏమిటి?
రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పంటల కనీస ధరను ఎంఎస్‌పీగా నిర్ణయిస్తుంది. ఈ విధానం వల్ల మార్కెట్‌లో పంటల ధర పడిపోయినా.. కేంద్ర ప్రభుత్వం ఈ ఎమ్‌ఎస్‌పీకి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తుంది. ఇది రైతులను నష్టాల నుంచి కాపాడుతుంది. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే దీని ప్రధాన ఉద్ధేశ్యం. దేశంలో మెుదటగా ఈ విధానాన్ని గోధుమలపై ప్రవేశపెట్టటం జరిగింది. తద్వారా ప్రభుత్వం రైతుల నుండి గోధుమలను కొనుగోలు చేసి దాని PDS పథకం(రేషన్ విధానం) కింద పేదలకు పంపిణీ చేస్తుంది.


Click it and Unblock the Notifications