7th Pay Commission: అటు ఎన్నికలు ఇటు పండుగ రెండు కలిసొచ్చే సమయాన్ని ఎంచుకుని కేంద్రం ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. దీంతో పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు.
కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెంచాలని నరేంద్ర మోదీ క్యాబినెట్ నిర్ణయించింది. తాజా పెంపుతో ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం గతంలోని 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా ప్రకటనతో 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. నేడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగులకు బోనస్‌లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

డియర్‌నెస్ అలవెన్స్ అనేది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని జీవిత ప్రమాణాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే డబ్బు. దీనిని ఏడాదికి రెండు సార్లు పెంచుతారు. దేశంలోని ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తుంటారు. అర్బన్, సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ భిన్నంగా ఉండవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫార్ములా..
[(గత 12 నెలల ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) సగటు - 115.76)/115.76]×100.
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులకు ఫార్ములా..
(గత 3 నెలల సగటు వినియోగదారు ధర సూచిక (బేస్ ఇయర్ 2001=100)- 126.33 ))x100
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications