G20 summit: దేశ రాజధాని ఢిల్లీలో G20 గ్లోబల్ సమ్మిట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలు దేశాలకు చెందిన అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. కాగా మొదటిరోజునే ఆయా దేశాధినేతల మధ్య ఓ విషయంపై ఏకాభిప్రాయం వచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు.
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్న భారత్.. G20 వేదికగా ఓ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ తో పాటు జీవ ఇంధనాలను కలిపి వినియోగించాలని పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు.

తమ జీరో ఉద్గారాల టార్గెట్‌లో భాగంగా స్థిరమైన జీవ ఇంధనాల ప్రాముఖ్యతను గుర్తించినట్లు న్యూదిల్లీ లీడర్స్ డిక్లరేషన్ లో G20 దేశాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ ను పెట్రోల్ తో కలిపి వినియోగించేందుకు చొరవ తీసుకోవాలని సభ్య దేశాలను భారత్ కోరింది. అయితే పలు దేశాలు దీనిపై ఆసక్తి కనబర్చినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇండియా ఎనర్జీ వీక్ 2023లో భాగంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రకటించారు. జీవ ఇంధన మార్కెట్లను బలోపేతం చేయడం, ట్రేడ్ ను సులభతరం చేయడం, జాతీయ బయో ఫ్యూయల్ కార్యక్రమాలకు సాంకేతిక మద్ధతు అందించడంపై దృష్టి పెట్టిన్నట్లు తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications