Suryoday Yojana: కోటి ఇళ్లకు సోలార్ వెలుగులు.. ప్రధాని మోదీ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు
PM Rooftop Solar: మారుతున్న అవసరాలకు అనుగుణంగా దేశంలోని విద్యుత్ వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో రానున్న కాలంలో కరెంటు బిల్లుల భారం ప్రజలకు నిద్రలేకుండా చేసే ప్రమాదం ఉంది.
ఈ క్రమంలో ప్రజలకు పెద్ద ఊరటను అందించాలని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్తు బిల్లును తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత సోమవారం నాడు ప్రధాని ఈ ప్రకటన చేశారు.

తాజా పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ లభిస్తుంది. దేశంలోని ప్రజలు తమ సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని తనకు బలీయమైన కోరిక ఉందని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోదీ తీసుకున్న మెుదటి నిర్ణయం ఇదే కావటం గమనార్హం. రామజన్మభూమి ఆలయంలో లార్డ్ రామ్ లల్లా పవిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఆలయ పట్టణం అయోధ్య నుంచి తిరిగి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటును స్వీకరించేలా ప్రోత్సహించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లు అనేది ప్రధాన విద్యుత్ సరఫరా యూనిట్‌కు అనుసంధానించబడిన భవనం పైకప్పుపై ఏర్పాటు చేయబడిన ఫోటోవోల్టాయిక్ ప్యానెల్‌లు. ఇది గ్రిడ్-కనెక్ట్ చేయబడిన విద్యుత్ వినియోగాన్ని తగ్గించటంతో పాటు వినియోగదారుల విద్యుత్ ఖర్చులను ఆదా చేస్తుంది. కేంద్రం ప్రస్తుతం నేషనల్ రూఫ్‌టాప్ పథకం ద్వారా మూలధన వ్యయంలో మొత్తం 40% ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.


Click it and Unblock the Notifications