వాషింగ్టన్: అమెరికా స్టాక్ మార్కెట్లు సహా అంతర్జాతీయ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఫైజర్, బయోఎన్‌టెక్, నోనావ్యాక్స్, తాజాగా మోడర్నా వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. కేసులు పెరిగినప్పటికీ తమ వ్యాక్సీన్ 90 శాతానికి పైగా ఫలితం కనిపిస్తోందని వెల్లడించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. 90 శాతం ఫలితం కనిపిస్తోందని గతవారం ఫైజర్ ప్రకటించడంతో ఆ స్టాక్స్ ఎగిశాయి. ఇప్పుడు మోడర్నా షేర్లు లాభపడ్డాయి.

పడిపోయిన ఫైజర్ స్టాక్స్
అంతకుముందు వ్యాక్సీన్ పైన ఫైజర్ ప్రకటన చేయడంతో మరుసటి రోజు షేర్లు భారీగా పెరిగాయి. తాజాగా మోడర్నా 94 శాతం ఫలితం వచ్చిందని తెలిపింది. మోడర్నా ప్రకటన అనంతరం ఫైజర్ స్టాక్స్ నేడు పడిపోయాయి. నేడు ఫైజర్ స్టాక్స్ 2.5 శాతానికి పైగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లో బయోఎన్‌టెక్ స్టాక్ కూడా 13.66 శాతం, నోవావ్యాక్స్ స్టాక్ 6.16 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం మేర నష్టపోయింది.
అదే సమయంలో మోడర్నా స్టాక్ 10 శాతానికి పైగా ఎగిసింది. ఒక ఫార్మా కంపెనీ కరోనా టీకాపై సానుకూల ప్రకటన చేసినప్పుడు, మరో కరోనా వ్యాక్సీన్ తయారు చేసే కంపెనీపై ప్రభావం కనిపిస్తోంది.

అమెరికా మార్కెట్లు ఇలా..
ఫైజర్ నుండి మోడర్న్ ఇంక్ వరకు ప్రకటనల నేపథ్యంలో అమెరికా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు హుషారు వచ్చింది. తాజా సెషన్‌లో డౌజోన్స్ 470.63 (1.60%) లాభపడి 29,950.44 వద్ద, నాస్‌డాక్ 94.84 (0.80%) లాభపడి 11,924.13 పాయింట్ల వద్ద, ఎస్ అండ్ పీ 41.76 (1.16%) శాతం ఎగిసి 3,626.91 వద్ద ముగిసింది. మోడర్నా ప్రకటన అనంతరం డౌజోన్స్ రికార్డు గరిష్టాన్ని తాకింది.

రికార్డ్ స్థాయికి..
మార్కెట్లు లైఫ్ టైమ్ గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన సూచీలు మూడు (నాస్‌డాక్, ఎస్ అండ్ పీ, డౌజోన్స్) ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్ 2000 సైతం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications