వాషింగ్టన్: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ఇంకా అనేక దేశాల్లో కనిపిస్తూనే ఉంది. ఈ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలి వెళ్లబోదనేది స్పష్టమైంది. భారత్ సహా పలు దేశాలు కరోనా వైరస్ ప్రభావానికి లోనవుతూనే ఉన్నాయి. థర్డ్‌వేవ్ ముప్పు సైతం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీనికి సంబంధించిన హెచ్చిరకలను నిపుణులు ఎప్పటికప్పుడు జారీ చేస్తోన్నారు. అటు కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కూడా అనేక దేశాల్లో విస్తరించింది. చాప కింద నీరులా పాకేసింది.
అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదవుతోన్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. భారత్‌లో 70 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యే అధికం. రెండో డోసు కోసం సుమారు 80 నుంచి 90 రోజుల పాటు వ్యవధి ఉంటోంది.

తొలి డోసు, రెండో డోసు మధ్య వ్యవధిని పెంచడం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ఉన్నంత కొరత ఇప్పుడు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ విస్తృతంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులోనూ కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. అది పరిమితమే.
ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ఇతర వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పుత్నిక్- వీ వాడకంలో ఉంటోంది. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి జైడస్ క్యాండిలా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటికి సంబంధించిన దరఖాస్తులు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద పరిశీనలో ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య డెల్టా వేరియంట్‌పై ఏ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందనే విషయంపై ఓ సర్వే నిర్వహించింది అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ.
దీని పేరు మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ. తన వీక్లీ సర్వే రిపోర్ట్‌ను వెలువడించింది. వ్యాక్సిన్ ఎఫీషియన్సీకి సంబంధించిన రిపోర్ట్ ఇది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై ఏ వ్యాక్సిన్ ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయాన్ని తీసుకుని ఈ సర్వేను నిర్వహించిందా సంస్థ. ఇందులో మోడెర్నా ఎఫీషియన్సీ అధికంగా ఉన్నట్లు తేలింది. డెల్టా వేరియంట్‌పై మోడెర్నా ఎఫీషియన్సీ 95 శాతం వరకు ఉందని నిర్ధారించింది. ఇది ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంటే ఎక్కువేనని తెలిపింది.
ఫైజర్ 80, జాన్సన్ అండ్ జాన్సన్ 60 శాతం వరకు మాత్రమే ఎఫీషియన్సీని చూపుతోండగా.. మోడెర్నా మాత్రం 95 శాతం ప్రభావవంతంగా ఉందని అమెరికాలోని ఇండియానా యూనివర్శిటీ రీసెర్చర్ షాన్ గ్రానీస్ తెలిపారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో 32 వేల మంది వద్ద నుంచి తీసుకున్న శాంపిళ్ల ద్వారా ఈ సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ఫైజర్ మినహా మోడెర్నా గానీ, జాన్సన్ అండ్ జాన్సన్ గానీ.. భారత్‌లో అత్యవసర వినియోగానికి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications