ఏప్రిల్ నెలలో వాహనాల సేల్స్ భారీగా క్షీణించాయి. టాటా మోటార్స్ డొమెస్టిక్ వెహికిల్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 41 శాతం క్షీణించగా, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 9.5 శాతం తగ్గాయి. మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 11 శాతం పడిపోయాయి. మార్చి నెలలో టాటా మోటార్స్ 66,609 వాహనాలను విక్రయించినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపిందది. ఏప్రిల్ నెలలో ఈ సేల్స్ 40.6 శాతం తగ్గి 41,739కి పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 70,263 సేల్ అయ్యాయి. ఇందులో కమర్షియల్ వాహనాల ఎగుమతులు 40 శాతం తగ్గి 2,209కి పరిమితమయ్యాయి.
మారుతీ సుజుకీ విక్రయాలు ఏప్రిల్ నెలలో నాలుగు శాతం తగ్గి 1,59,691 యూనిట్లకు క్షీణించాయి. మార్చినెలలో 1,67,014 కార్లని విక్రయించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాహన సరఫరాకి ఇబ్బందులు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. 2020 ఏప్రిల్ నెలలో కఠిన లాక్డౌన్ కారణంగా మారుతి ఒక్క కారునూ విక్రయించలేదు. రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుండాయ్ మార్చ్ విక్రయాలు 8 శాతం తగ్గి 64,621 యూనిట్ల నుండి 59,203కు తగ్గాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా(M&M) మొత్తం వాహనాల సేల్స్ ఏప్రిల్ నెలలో 10 శాతం తగ్గి 36,437 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్చి సేల్స్ 40,403 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కియా హోల్‌సేల్ విక్రయాలు 16 శాతం క్షీణించి 16,111 యూనిట్లకు పరిమితమయ్యాయి. మార్చిలో 19,100 కార్లు విక్రయించింది. హోండా కార్ప్ సేల్స్ మాత్రం 28 శాతం పెరిగి 9,072 యూనిట్లుగా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications