CFO Resignation: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచం వేగంగా మారిపోతున్న తరుణంలో పాత కాలపు పద్ధతులకు చెక్ పెట్టేస్తున్నాం. అయితే ఓ లిస్టెడ్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
పెయింట్ తయారీ సంస్థ మిత్షి ఇండియా.. దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబడిన సంస్థ. దీనికి రింకూ పటేల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవి నుంచి నిష్క్రమించాలని భావించారు. అందుకు రాజీనామా సమర్పించేందుకు సదరు ఆఫీసర్ ఎంచుకున్న మార్గం ఇప్పుడు వైరల్ అవుతోంది.

రెండు పేరాలతో రాసిన రాజీనామాను కంపెనీ CFO తన మేనేజింగ్ డైరెక్టర్‌కు సమర్పించారు. అయితే ఇంటర్నెట్ రోజుల్లోనూ, పిల్లలు వినియోగించే బ్రాడ్ రూల్స్ నోట్ పుస్తకంలోని పేపర్ మీద సాదాసీదాగా చేతితో మ్యాటర్ రాసి పంపారు. ఇది చూసిన నెటిజన్లు పలురకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.
'వ్యక్తిగత కారణాల వల్ల నేను తక్షణమే CFO ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన అనుభూతిగా భావిస్తున్నాను' అని రింకూ పటేల్ లేఖలో పేర్కొన్నారు. దీనిని అంగీకరించినట్లు మిత్షీ ఇండియా తన ఎక్స్ఛేజ్ ఫైలింగ్ లో పేర్కొంది. త్వరలోనే కొత్త CFOని నియమించనున్నట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications