ముంబై: టాటా గ్రూప్‌తో తమకు 70 ఏళ్ళకు పైగా ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్(SP గ్రూప్) వెల్లడించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‍లో హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌కు 18.37 శాతం వాటా ఉంది. టాటా గ్రూప్‌తో కొనసాగుతున్న న్యాయ వివాదం వల్ల ఆర్థికంగానే కాకుండా ఎంతోమంది జీవనోపాధికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆ గ్రూప్ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎస్పీ గ్రూప్ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ కూడా అంగీకరించింది. అలాగే, మిస్త్రీ కుటుంబం కూడా అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది.

28వ తేదీ వరకు తనఖా పెట్టవద్దు.. బదలీ చేయవద్దు
బాండ్స్ చెల్లంపులకు అవసరమైన నిధులను సమీకరించాలని ఎస్పీ గ్రూప్ భావిస్తే ఆ గ్రూప్‌కు ఉన్న 18 శాతం వాటా కొనుగోలు చేస్తామని సుప్రీం కోర్టుకు టాటా సన్స్ తరఫు లాయర్ తెలిపారు. ఒకవేళ ఎస్పీ గ్రూప్ షేర్ల తనఖా ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తే ఆ షేర్లు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంటుందని టాటా గ్రూప్ అభిప్రాయపడింది. దీంతో అక్టోబర్ 28వ తేదీ వరకు ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీ, ఆయన పెట్టుబడి సంస్థలు టాటా సన్స్ షేర్లను తనఖా పెట్టడం లేదా బదలీ చేయడం వంటివి చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 28వ తేదీ వరకు ఇప్పటికే తనఖా పెట్టిన షేర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కూడా టాటా సన్స్, ఎస్పీ గ్రూప్‌లకు సూచించింది.

వివాదం.. ఇలా ముదిరింది
2016లో పల్లోంజీ తనయుడు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా తొలగించినప్పటి నుండి టాటా సన్స్, సైరస్ మిస్త్రీ ఫ్యామిలీ మధ్య వివాదం ముదిరింది. కరోనా నేపథ్యంలో ఆస్తుల అమ్మకాలు నిలిచిపోవడం, బాండ్స్ చెల్లింపులు చేసేందుకు టాటా సన్స్‌లో వాటా తనఖా ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించే యోచనలో ఎస్పీ గ్రూప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మార్క్యూ కెనడియన్ ఇన్వెస్టర్‌తో ఒప్పందం కుదిరింది. అయితే తమ నిధుల సమీకరణ ప్రణాళికను అడ్డుకునేందుకు టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించిందని ఎస్పీ గ్రూప్ అంటోంది. దీంతో మైనార్టీ వాటాదార్ల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని తెలిపింది. అయితే నిధుల సమీకరణే కావాలంటే మార్కెట్ ధర వద్ద ఎస్పీ గ్రూప్ వాటాను కొనేందుకు టాటా సన్స్ సిద్ధమని టాట్ గ్రూప్ తెలిపింది. కానీ తనఖా పెట్టాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటాల నుండి తప్పుకునే సమయం వచ్చిందని మిస్త్రీ కుటుంబం చెప్పడం గమనార్హం.

టాటా గ్రూప్‌లో ఎంత వ్యాల్యూ ఉంది?
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటాస్, టాటా ట్రస్ట్‌కు వరుసగా 12.9 శాతం, 65.9 శాతం వాటాలు ఉన్నాయి. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు 18.4 శాతం వాటా ఉంది. రతన్ టాటాకు 0.8 శాతం వాటా ఉంది. ితరులకు 2 శాతం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని వ్యాల్యూ రూ.1.75 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో టాటా గ్రూప్ ఎంత ధర చెల్లించేందుకు సిద్ధమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది సవాల్‌తో కూడుకున్నదే
ఏ రకంగా చూసినా టాటా సన్స్‌కు ఎస్పీ గ్రూప్ వాటాను కొనుగోలు కాస్త సవాల్‌తో కూడుకున్నదే అంటున్నారు. ఎస్పీ గ్రూప్ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ మొదట టీసీఎస్‌లో ప్రస్తుతం తమకు ఉన్న 72 శాతం వాటాలో 16 శాతం విక్రయించి 56 శాతానికి తగ్గించాలని అంటున్నారు. లేదా వ్యూహాత్మక భాగస్వాములు లేదా బయటి పెట్టుబడిదారులు (ప్రయివేటు ఈక్విటీ, సావరీన్ వెల్త్ ఫండ్) టాటా సన్స్‌లోకి రావాలి.

దశాబ్దాల అనుబంధం..
టాటా సన్స్‌లో మిస్త్రీ ఫ్యామిలీ 1965లో ఈక్విటీ ఓనర్‌షిప్‌ను దక్కించుకుంది. 2012 డిసెంబర్‌లో సైరస్ మిస్త్రీ చైర్మన్ అయ్యారు. 2016 అక్టోబర్‌లో తొలగించారు.
2016లో టాటా సన్స్ ప్రకారం టాటా సన్స్ మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు. మిస్త్రీ ఫ్యామిలీ వాటా రూ.57,600 కోట్లు.
మిస్త్రీ ఫ్యామిలీ అంచనా ప్రకారం టాటా సన్స్ వ్యాల్యుయేషన్ రూ.9.7 లక్షల కోట్లు. మిస్త్రీ ఫ్యామిలీ వాటా రూ.1.78 లక్షల కోట్లు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications