For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా సన్స్-మిస్త్రీ ఇష్యూ: సుప్రీం కోర్టులో సైరస్ మిస్త్రీ పిటిషన్

|

NCLAT ఆదేశాల్లో పలు అతిక్రమణలను తొలగిచాలని కోరుతూ సైరస్ మిస్త్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రైబ్యునల్ నుంచి తన కుటుంబానికి మరింత ఉపశమనం దక్కాల్సి ఉందన్నారు. టాటా సన్స్‌లో 18.37 శాతం వాటా ఉన్న మిస్త్రీ కుటుంబం కోర్టులో క్రాస్ అప్పీలును దాఖలు చేసింది. తీర్పులోని కొన్ని అంశాలపై అప్పీల్ చేయడాన్ని క్రాస్ అప్పీల్‌గా చెబుతారు.

టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ.. మరిన్ని కథనాలు

సైరస్ మిస్త్రీ, పెట్టుబడి సంస్థలు ఈ పిటిషన్‌ను ఫిబ్రవరి 13న దాఖలు చేశాయి. సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి. కాగా, టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని నియమిస్తూ NCLAT గత ఏడాది డిసెంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ అప్పీలు మేరకు సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.

 Mistry moves Supreme Court seeking directorship at Tata Sons

2016 అక్టోబర్ 24న మిస్త్రీని తొలగించారు. కార్పోరేట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. ఇందులో భాగంగానే NCLATని ఆశ్రయించగా.. మిస్త్రీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటా సన్స్ లేదా ఇతర గ్రూప్ కంపెనీల్లో చైర్మన్ లేదా ఎగ్జిక్యూటివ్ పదవులు చేపట్టాలనే ఆసక్తి తనకు లేదని, హోల్డింగ్ కంపెనీ బోర్డులో మాత్రం చోటు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

English summary

టాటా సన్స్-మిస్త్రీ ఇష్యూ: సుప్రీం కోర్టులో సైరస్ మిస్త్రీ పిటిషన్ | Mistry moves Supreme Court seeking directorship at Tata Sons

Cyrus Mistry and his investment firms have filed a fresh petition in the Supreme Court, pleading that they be granted directorship in Tata Sons Ltd.
Story first published: Tuesday, February 18, 2020, 11:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X