ఇంకా ITR ఫైల్ చేయలేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. చివరి తేదీ సెప్టెంబర్ 15 అని అనుకుని టెన్షన్ పడుతున్న వారందరికీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఊరట ఇచ్చింది. చివరి రోజున పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా మందికి రిటర్నులు ఫైల్ చేయడం కష్టమైంది. అందుకే పన్ను శాఖ గడువును మరొక రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ 16 అంటే ఈరోజు వరకు అవకాశం కల్పించింది. ఇప్పుడు మీరు కూడా రిలాక్స్‌గా, తొందరపడి కాకుండా మీ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ఫైల్ చేయడానికి గడువు ఎల్లప్పుడూ టాక్స్ పేయర్లకు ఒక పెద్ద మైలురాయి లాంటిదే. చాలా మంది చివరి రోజే ఫైల్ చేయడానికి ప్రయత్నించడం వల్ల పోర్టల్ పై భారీ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. మొదట 2025-26 అంచనా సంవత్సరానికి సంబంధించిన ITRలను ఫైన్ లేకుండా ఫైల్ చేయడానికి గడువును సెప్టెంబర్ 15 సోమవారం నిర్ణయించారు. కానీ చివరి రోజున అనూహ్యంగా పోర్టల్ పనిచేయకపోవడంతో, (CBDT) ఈ గడువును ఒక రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఇచ్చింది.

ఎందుకు వాయిదా వేశారు?
ఈసారి గడువు పొడిగించడానికి ప్రధాన కారణం టెక్నికల్ గ్లిచ్. చివరి రోజున అంటే సెప్టెంబర్ 15న, ITR e-filing పోర్టల్‌లో భారీ ట్రాఫిక్ రావడంతో చాలా మందికి సైట్ ఓపెన్ కాకపోవడం, సబ్మిట్ బటన్ పనిచేయకపోవడం, OTPలు రాకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. దీనిపై CBDT స్పందిస్తూ, "టాక్స్ పేయర్లకు మరింత సౌలభ్యం కల్పించడానికి గడువును ఒక రోజు పొడిగిస్తున్నాము" అని ప్రకటించింది.
ఇదే రోజున మరో కారణం కూడా ఉంది. రెండో త్రైమాసిక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ఇదే రోజున ఉండటంతో e-filing పోర్టల్‌పై ట్రాఫిక్ మరింతగా పెరిగింది. అంతే కాకుండా, పోర్టల్‌ను సెప్టెంబర్ 16 ఉదయం 12 గంటల నుండి 2:30 గంటల వరకు మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంచి కొన్ని సాంకేతిక మార్పులు చేశారు.
పోర్టల్ యాక్సెస్ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కొన్ని ట్రబుల్ షూట్ సూచనలు కూడా ఇచ్చింది. అయినా కూడా చాలామంది టాక్స్ పేయర్లు లాగిన్ కావడంలో సమస్యలు ఎదుర్కొన్నారని (PTI) వార్త సంస్థ తెలిపింది.
ఈసారి టాక్స్ పేయర్లు చాలా ఉత్సాహంగా రిటర్నులు ఫైల్ చేశారు. సెప్టెంబర్ 15 వరకు 7.3 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి. ఇది గత సంవత్సరం మొత్తం దాఖలైన 7.28 కోట్ల రిటర్న్లను మించి ఉంది.
కొద్దిగా వెనక్కి వెళ్తే, ప్రతి సంవత్సరం ITR ఫైలింగ్‌లో ఒక మంచి పెరుగుదల కనిపిస్తోంది. ఉదాహరణకు, 2023-24 అంచనా సంవత్సరంలో సుమారు 6.77 కోట్ల రిటర్నులు మాత్రమే దాఖలయ్యాయి. కానీ, ఆ తర్వాతి ఏడాది 2024-25 అంచనా సంవత్సరానికి, జూలై 31, 2024 నాటికే 7.28 కోట్ల ITRలు ఫైల్ అయ్యాయి. అంటే కేవలం ఏడాది లోనే దాదాపు అర్ధ కోటి మంది అదనంగా తమ రిటర్నులు సమర్పించారు. ఇది చూస్తే, ప్రతి ఏడాది మరింత మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు ఫైల్ చేయడానికి ముందుకు వస్తున్నారని, అలాగే టాక్స్ పేయర్లలో అవగాహన, బాధ్యత కూడా పెరిగిందని అనిపిస్తుంది. ఒకప్పుడు చివరి నిమిషంలో మాత్రమే ఫైల్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా మంది ముందుగానే ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దేశంలో టాక్స్ కల్చర్ క్రమంగా మెరుగవుతోందనే సంకేతం.
మీరు ఇంకా ITR ఫైల్ చేయకపోతే, ఇది మీకు ఒక చివరి అవకాశం లాంటిది. ఇప్పుడు గడువు సెప్టెంబర్ 16 వరకు పొడిగించబడింది. ఏమైనా ఆలస్యం జరిగిపోయిందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు వెంటనే లాగిన్ అయి మీ రిటర్న్ ఫైల్ చేసేయండి. ఇలాంటివి చివరి నిమిషంలో కాకుండా ముందుగానే చేయడం వల్ల టెక్నికల్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈసారి పొడిగింపు దొరికింది... కానీ వచ్చే ఏడాది ముందు జాగ్రత్తగా ముందుగానే ఫైల్ చేస్తే ఇబ్బందులు లేకుండా సులభంగా పూర్తవుతుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications