Penny Stock: పరుగులు తీసిన పెన్నీ స్టాక్.. లక్షకు 14 రెట్ల లాభం.. షాకైన ఇన్వెస్టర్లు..
Penny Stock: పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రమాదకరం. అయితే.. హై రిస్క్ ఇన్వెస్టర్లు అలాంటి స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంటారు. కొన్ని పెన్నీ షేర్ రిటర్న్‌లు కూడా దీర్ఘకాలంలో గొప్ప రాబడిని ఇస్తాయనటానికి ఇదే సరైన ఉదాహరణ. మల్టీబ్యాగర్ రాబడులతో కాసులు కురిపించిన ఎఫ్ఎమ్సీజీ స్టాక్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

స్టాక్ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మిష్టన్ ఫుడ్స్(Mishtann Foods) కంపెనీ షేర్ల గురించే. అవును ఈ పెన్నీ స్టాక్ కేవలం నాలుగు సంవత్సరాల్లో మంచి రాబడులను అందించింది ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ఈ కాలంలో షేర్ ఏకంగా 650 శాతం రాబడిని అందించింది. అప్పట్లో షేర్ ధర కేవలం రూ.1.50 మాత్రమే. అవును వింటుంటే నిజమా.. మంచి చాన్స్ మిస్ అయ్యిందే అనుకుంటున్నారా. కొంత రీసెర్చ్ చేస్తే మంచి ఫండమెంటల్స్ కలిగిన లాభదాయకమైన స్టాక్స్ తక్కువ ధరలో ఉండగానే మీరు గుర్తించగలరు. సరైన సమయంలో ఇన్వెస్ట్ చేస్తే మీకూ లాభాలు తప్పక వస్తాయి.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ ప్రధానంగా బాస్మతీ రైస్, గోధుమలు, బ్లాక్ సాల్ట్, పప్పుధాన్యాలు వ్యాపారంలో ఉంది. అయితే కంపెనీ ప్రధానంగా బాస్మతీ రైస్ అమ్మకాల్లో అగ్రభాగాన్ని కలిగి ఉంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ మంచి లాభాలను ఆర్జిస్తూ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తోంది.

మిష్టన్ ఫుడ్స్ షేర్ ధర చరిత్ర..
ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత నెలలో రూ.8.37 నుంచి రూ.11కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2022 ప్రారంభం నుంచి ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లాభాల ఒత్తిడిలో ఉంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఆరు నెలల్లో రూ.13.85 నుంచి రూ.11 స్థాయిలకు పడిపోయింది. ఈ కాలంలో దాదాపు 20 శాతం పడిపోయింది.

పెన్నీ స్టాక్ గా ప్రారంభమై..
నాలుగు సంవత్సరాల క్రితం ఈ స్టాక్ కేవలం రూ.1.50 వద్ద ట్రేడ్ అవుతుండేది. రెండేళ్ల కిందట స్టాక్ ధర రూ.9.50 వద్ద ఉంది. మూడు సంవత్సరాల కిందట స్టాక్ ధర రూ.3.65 వద్ద ఉంది. ఆరు నెలల కిందట స్టాక్ తన ఇన్వెస్టర్లకు ప్రతి షేరుకు కలిగి ఉన్నందుకు గాను ఒక షేర్ ఉచితంగా అందించింది. బోనస్ షేర్లను పొందిన పెట్టుబడిదారులు నాలుగేళ్ల కిందట ఈ స్టాక్ లో పెట్టుబడిగా లక్ష పెట్టి దానిని కొనసాగించి ఉంటే వారికి రూ.14 లక్షల ఆదాయం వచ్చి ఉండేది.


Click it and Unblock the Notifications