Stock broker: జెరోధా, అప్ స్టాక్స్, ఆలిస్ బ్లూ వంటి ఆధునిక స్టాక్ బ్రోకింగ్ సంస్థల పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటినుంచో ఇదే రంగంలో సేవలందిస్తున్న బ్రోకింగ్ దిగ్గజం తన ప్రస్థానాన్ని ముగించనున్నట్లు తెలుస్తోంది. వేరొకరికి తమ సంస్థను విక్రయించేందుకు గ్రౌండ్ క్లియర్ అయింది. ఆ సంస్థ భవిష్యత్తు ఎలా ఉండనుందో మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.
దేశీయ స్టాక్ బ్రోకింగ్ రంగంలో ప్రముఖ ప్లేయర్ 'షేర్ ఖాన్'ను కొనుగోలు చేసేందుకు మీరే గ్రూప్ రెడీ అయింది. ఇందుకోసం BNP పారిబాస్ తోపాటు బోర్డు అనుమతులను సైతం పొందింది. త్వరలోనే షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు ఆయా బోర్డులు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ డీల్ ద్వారా మీరే గ్రూప్ షేర్ ఖాన్ లోని పూర్తి వాటాను దక్కించుకోనుంది.

ఈ భారీ లావాదేవీలో షేర్ ఖాన్ BNP పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఎస్ప్రెస్సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎడ్యుకేషనల్ బిజినెస్ షేర్ ఖాన్ డాట్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరే గ్రూప్ ఈ డీల్ పక్కా చేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదంతో ఈ డీల్ పూర్తికానుంది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ప్రారంభంలో ఈ లావాదేవీ ముగింపుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఏళ్ల తరబడి స్టాక్ బ్రోకింగ్ సేవలందించిన భారీ సంస్థ ఇలా అమ్మకానికి రావడం పట్ల ఇన్వెస్టర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications