Gold Price: బంగారం ధర ఇప్పుడు తగ్గినా తర్వాత పెరుగుతుంది.. మిరే అసెట్..!

అమెరికా ట్రెజరీ దిగుబడులు పెరగడం, విలువైన లోహంపై మరింత ద్రవ్య భారం పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయ బంగారం ధరలు 2026 ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 5,417 డాలర్ల నుంచి 24.6 శాతం తగ్గిందని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. అయితే సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, రిజర్వ్ డైవర్సిఫికేషన్, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్యస్థం నుంచి దీర్ఘకాలికంగా బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తుందని ఈ ఫండ్ హౌస్ ఆశిస్తోంది. బంగారం ఇటీవలి బలహీనత లోహం క అంతర్లీన మౌలిక అంశాలలో క్షీణతను కాకుండా, అధిక బాండ్ ఈల్డ్స్‌ను ప్రతిబింబిస్తుందని మిరే అసెట్ తన నివేదికలో పేర్కొంది. స్వల్పకాలిక అస్థిరత అధికంగానే ఉన్నప్పటికీ ఔన్సుకు 4,200 డాలర్ల కంటే తక్కువ స్థాయి ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాన్ని అందిస్తాయని తెలిపింది.

2026 అక్టోబర్ 6 నాటికి యూఎస్ ట్రెజరీ డేటా 10 సంవత్సరాల దిగుబడిని 5.27 శాతంగా నమోదు చేసింది. పెరుగుతున్న దిగుబడుల వల్ల స్వల్పకాలిక బలహీనత ఏర్పడినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా పోగుపడిన లాభాలలో గణనీయమైన భాగాన్ని బంగారం నిలుపుకుంటోందని ఫండ్ హౌస్ పేర్కొంది. సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు బంగారం అమ్మకాలకు ఒక ముఖ్యమైన నిర్మాణాత్మక చోదకంగా పని చేస్తున్నాయని విశ్లేషించింది. సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని వివిరంచింది. 2010-2021 మధ్య 470 టన్నులతో పోలిస్తే డిమాండ్ దాదాపు 700 టన్నుల వద్ద ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.

Gold Price

సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు 41 టన్నులకు పైగా పెరిగాయని, 89 శాతం సెంట్రల్ బ్యాంకులు ప్రపంచ బంగారు నిల్వలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయని, 45 శాతం బ్యాంకులు తమ సొంత బంగారు నిల్వలను పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని కూడా ఫండ్ హౌస్ పేర్కొంది. డీ-డాలరైజేషన్ (డాలర్ వాడకాన్ని తగ్గించడం) ధోరణి కొనసాగుతోందని మిరే అసెట్ హైలైట్ తెలిపింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ నిల్వలను వైవిధ్యపరుస్తూ, యూఎస్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని వివరించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు బంగారానికి మరో నిర్మాణాత్మక మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇంధన భద్రత, వాణిజ్య మార్గాలు చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత ఆస్తిగా బంగారం పాత్రను బలోపేతం చేస్తున్నాయని మిరే అసెట్ పేర్కొంది. భారతదేశపు భౌతిక డిమాండ్ కూడా స్వల్పకాలికంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. నవరాత్రి, దసరా, దీపావళి, వివాహాల సీజన్‌తో కూడిన అత్యంత బలమైన డిమాండ్ కాలంలో దేశం ప్రవేశిస్తోందని, పండుగలు, వివాహాలకు సంబంధించిన కొనుగోళ్లు వినియోగానికి మద్దతు ఇస్తాయని ఫండ్ హౌస్ తెలిపింది. మధ్యకాలికం నుం;f దీర్ఘకాలికంగా బంగారంపై మిరే అసెట్ సానుకూల దృక్పథంతో ఉంది. పెరిగిన యూఎస్ బాండ్ దిగుబడులు, భవిష్యత్ ఫెడరల్ రిజర్వ్ చర్యల చుట్టూ ఉన్న అనిశ్చితి అడపాదడపా అస్థిరతను సృష్టిస్తాయని ఇది అంచనా వేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+