Mirae Asset Mutual Fund: దేశంలో చాలామంది చిన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లతో పాటుగా మ్యూచువల్ ఫండ్స్ పై మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ మార్గం ద్వారా మార్కెట్లలోకి కోట్లలో డబ్బు వచ్చి చేరుతోంది. ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఫండ్ హౌసెస్ చిన్న సిప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల సెబీ సైతం తక్కువ మెుత్తంతో పెట్టుబడులు అందుబాటులోకి తీసుకెళ్లాలని ప్రస్థావించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ గురించే. గతంలో ఫండ్ హౌస్ తన ఎస్ఐపీ కనీస మెుత్తాన్ని రూ.500గా ఉంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ తన ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవింగ్స్ ఫండ్ కోసం కనీస పెట్టుబడి మెుత్తాన్ని రూ.500గా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే కంపెనీ తన పెట్టుబడి కనీస మెుత్తాల విషయంలో ప్రస్తుతం మార్పులు చేపట్టింది. వాస్తవానికి దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు విస్తృత ప్రాప్తిని పెంచే లక్ష్యంతో మైక్రో SIPలను ప్రవేశపెట్టాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇటీవలి చొరవకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ హౌస్ నిర్ణయం వచ్చింది.

క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నెలకు రూ.250 నుంచి ప్రారంభమయ్యే SIPలను ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ మంది చిన్న ఇన్వెస్టర్లను మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ రూ.250 SIP మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో పాల్గొనకుండా గతంలో మినహాయించబడిన అనేక మంది భారతీయ వ్యక్తుల కోసం గేట్‌వేని అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడి థ్రెషోల్డ్‌ను తగ్గించడం ద్వారా మ్యూచువల్ ఫండ్‌లను ఆచరణీయ పెట్టుబడి మార్గంగా పరిగణించేందుకు సెబీ దేశంలోని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే గతవారం ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ రూ.100 ప్రారంభ పెట్టుబడితో సిప్ చేసేందుకు అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ ఈ క్రమంలో డెయిలీ సిప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రోజూ డబ్బు సేవ్ చేయాలనుకునే యువత, చిన్న వ్యాపారులకు సదవకాశాన్ని కల్పించనుంది.
కంపెనీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 1, 2024 నుంచి తన మ్యూచువల్ ఫండ్స్ కనీస సిప్ మెుత్తాన్ని రూ.99కి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇందులో ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవింగ్స్ స్కీమ్ మాత్రం మినహాయింపుగా వెల్లడించింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఆగస్టులో SIP కంట్రిబ్యూషన్‌లు ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.23,547 చేరుకున్నట్లు వెల్లడించింది. ఇవి జూలై నెలలో రూ.23,331 కోట్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో నిర్వహణలో ఉన్న SIP ఆస్తులు జూలైలో రూ.13.09 లక్షల కోట్ల నుంచి రూ.13.39 లక్షల కోట్ల సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications