Unemployment Row: సిటీ గ్రూప్ రిపోర్టును కొట్టిపాడేసిన కేంద్రం.. పూర్తి వివరాలు..
Centre on Citi Group: భారతదేశంలో ఉద్యోగాల కల్పనపై తాజాగా సిటీ గ్రూప్ నివేదికి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 7 శాతానికి పైగా ఉన్నప్పటికీ అవసరమైన స్థాయిలో ఉద్యోగాల కల్పన ఇండియా భవిష్యత్తులో చేయలేదని తన నివేదికలో సిటి గ్రూప్ బాంబు పేల్చింది.
అయితే రిపోర్టు వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆందోళనలు లేవనెత్తిన సిటీ గ్రూప్ రీసెర్చ్ నోట్‌ను కేంద్రం తిప్పికొట్టింది. రిపోర్ట్ 'పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా KLEMS డేటా వంటి అధికారిక సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవటంలో విఫలమైందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం రేటుతో వృద్ధి చెందినప్పటికీ.. రానున్న దశాబ్దంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఉద్యోగాలను సృష్టించేందుకు భారతదేశం కష్టపడుతుందని సిటీ గ్రూప్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ క్రమంలో ఉపాధి అవకాశాల కల్పనను పెంచడానికి మరిన్ని సమిష్టి చర్యలు అవసరమని సూచించింది. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో భారతదేశం 8 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టించిందని, ఇది ఏటా సగటున 2 కోట్ల ఉద్యోగాలకు సమానమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కోవిడ్-19 అంతరాయం ఉన్నప్పటికీ భారతదేశంలో ఉపాధి కరువయ్యే అవకాశం ఉందని సిటీ గ్రూప్ వాదనకు విరుద్ధంగా ఉంది. సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, బకర్ జైదీ నివేదికలో 7 శాతం వృద్ధి రేటు ఆధారంగా భారతదేశం సంవత్సరానికి 8-9 మిలియన్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలదని తమ అంచనాలను ప్రచురించారు. అయితే.. అధికారిక డేటా మూలాధారాలు లేబర్ మార్కెట్ సూచికలలో 'స్థిరమైన మెరుగుదలలు' చూపించాయని, గత ఐదేళ్లలో నిరుద్యోగం రేటు తగ్గుముఖం పట్టిందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. EPFO, NPS డేటా ఈ సానుకూల ఉపాధి ధోరణికి మరింత మద్దతునిస్తుందని తెలిపింది.


Click it and Unblock the Notifications