Fintech News: పేటీఎం సంక్షోభం మరువక ముదే మరో ఫిన్‌టెక్ కంపెనీకి నోటీసులు.. కానీ..
BharatPe: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో ప్రస్తుతం పేటీఎం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో ఫిన్ టెక్ కంపెనీల పట్ల నియంత్రణ సంస్థ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఇదే రంగానికి చెందిన మరో కంపెనీకి కేంద్రం షాక్ ఇచ్చింది. అయితే ఇది నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ నుంచి వచ్చింది కాకపోవడం గమనార్హం.
ఫిన్ టెక్ యూనికార్న్ భారత్ పే వ్యవస్థాపకులుగా అష్నీర్ గ్రోవర్ బిజినెస్ ప్రపంచానికి సుపరిచితమే. ఆయనపై సొంత కంపెనీనే చట్టపరమైన చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని కోరుతూ కంపెనీల చట్టంలోని సెక్షన్ 206 కింద సంస్థకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసు పంపించింది.

'అదనపు సమాచారం కోసం కంపెనీకి ROC లేఖ రాసింది. 2022లో అంతర్గత సమీక్ష తర్వాత నుంచి కొనసాగుతున్న విచారణలో భాగంగా వివరాలు సమర్పించాలని లేఖలో పేర్కొంది. మా ఆడిట్ ఫలితాలలో సమాచారాన్ని అందించాం. అయితే సాధ్యమైనంత మేర వారికి సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రోవర్‌పై సివిల్ మరియు క్రిమినల్ కేసుల ఫిర్యాదులకు సంబంధించి కోర్టులకు సమర్పించిన సాక్ష్యాలను కోరుతూ MCA ఈ లేఖ రాసినట్లు సమాచారం. 2022 ప్రారంభంలో నైకా IPO కేటాయింపులో విఫలమైనందుకు కోటక్ గ్రూప్ ఉద్యోగిని అనుచిత పదజాలంతో బెదిరించారని గ్రోవర్‌పై ఆరోపణలు వచ్చాయి. అనంతరం భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు.
అయితే ఆయన హయాంలోని ఆర్థిక విధానాలపై కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించింది. నకిలీ బిల్లులను ఉపయోగించి సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు సివిల్ దావా వేసింది. వాటిని తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారని అందులో పేర్కొంది. వీటికితోడు సందేహాస్పద లావాదేవీలు, నకిలీ విక్రేతల విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.


Click it and Unblock the Notifications