Hyderabad: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఆఫీస్కు త్వరగా వెళ్లొచ్చు..!
హైదరాబాద్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా ఐటీ కారిడార్లలో వర్క్ చేస్తున్న సాఫ్ట్ ఇంజనీర్లు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ బస్సులను ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ క్యాంపెయినర్ కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తో కలిసి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, డైలీ షటిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చాలా మంది ఐటీ ఉద్యోగులు మెట్రోకు వచ్చి ఆటోలో వెళ్లాల్సి వస్తుంది. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. లేదంటే సొంత వాహనాల్లో వస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ డైలీ షటీల్ బస్సులు అందుబాటులోకి రావడం ద్వారా మెట్రో దిగిన ఉద్యోగులు బస్సుల ద్వారా వారి ఆఫీసులకు వెళ్లొచ్చు. డైలీ షటిల్స్ ద్వారా హైదరాబాద్ లోని వివిధ ఐటీ కారిడార్లకు ఉద్యోగస్తులు రోజువారీగా సౌకర్యవంతంగా ప్రయాణించేలా ప్రత్యేక బస్సులను తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు.

ఈ సేవల ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సౌకర్యాలు, భద్రత ప్రమాణాలు, సమయపాలన, సీటింగ్, డిజిటల్ బుకింగ్ వంటి ప్రత్యేకతలతో ఉద్యోగులకు నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ హితమైన స్మార్ట్ నగర రవాణా వ్యవస్థ అభివృద్ధి కి డైలీ షీటిల్స్ ఒక కొత్త అడుగుగా నిలుస్తుందని వివరించారు.
గతంలో కూడా ఒకటి, రెండు షటీల్ బస్సులు తిరిగేవి. ఇందులో మహిళలు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు తీసుకొచ్చి డైలీ షటీల్ బస్సుల్లో ఎవరైనా ప్రయాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీ ఉద్యోగులు అందరు సొంత వాహనాలు వాడితే రోడ్లపై ట్రాఫిక్ జామ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వారు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడితే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆఫీస్ వెళ్లడానికి తన కారు బయటకు తీస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెబుతున్నారు. అదే వ్యక్తి మెట్రోలో ప్రయాణం చేస్తే రోడ్ పై వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications