AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కర్నూలు జిల్లాలో ఆసియాలోనే అతి పెద్ద బేవరేజ్ ప్లాంట్..
ఏపీకి కొత్త పరిశ్రమల స్థాపన వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఏపీకి మరో భారీ పరిశ్రమ పూర్తియంది. ఈ విషయాన్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆసియాలోనే అతి పెద్ద బేవరేజ్ ప్లాంట్ ఏపీలు నిర్మించినట్లు ఆయన ప్రకటించారు. అంతకు ముందు ఆయన ఓ ట్వీట్ వేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అత్యంత రహస్య పెట్టుబడి వ్యూహం బయటపడింది. అదేమిటంటే "పెట్టుబడిదారుల విజ్ఞప్తులకు అదే రోజున స్పందించడం." దీన్ని ఎవరైనా అనుసరించవచ్చు!" అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ పెట్టుబడికి సంబంధించి ప్రకటన చేశారు. "ఆంధ్రప్రదేశ్ నేల నుంచి ఒక స్వదేశీ బ్రాండ్ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, శంకుస్థాపన జరిగిన కేవలం 12 నెలల తర్వాత కర్నూలులోని ఓర్వకల్లో ఆసియాలోనే అతిపెద్ద పానీయాల ప్లాంట్‌ను ప్రారంభించింది" అని ప్రకటన చేశారు.
కర్నూలు జిల్లో ఓర్వకల్ లో గత సంవత్సరం నవంబర్‌లో ముఖ్యమంత్రి ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. సంవత్సరంలోపే ఈ ప్రపంచ స్థాయి ప్లాంట్ పుర్తయింది. ఇందులో క్యాంపా కోలా, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తోంది.కాగా క్షేత్రస్థాయిలో తమ వ్యాపార వేగం ఇలా ఉంటుందని నారా లోకేష్ అన్నారు. స్పీడ్, స్కేల్, స్ట్రాటజీ.. ఇప్పుడిదే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ట్రెండని పేర్కొన్నారు. 10 లైన్లతో కూడిన ఆసియాలోనే అతిపెద్ద బేవరేజ్ ప్లాంట్ భూమి పూజ నుంచి కమిషనింగ్ దాకా కేవలం 12 నెలల్లోనే పూర్తయిందన్నారు. దీన్నే ఆయన #SpeedOfDoingBusiness అంటూ ట్యాగ్ చేసి, ఆ ప్లాంట్ ఏదనేది సాయంత్రం 5 గంటలకు రివీల్ చేస్తానంటూ ట్విస్ట్ చేశారు.

మామూలుగా భారీ ప్లాంట్లంటే ఫైళ్లు కదలడానికే నెలలు గడిచిపోతాయిని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణాలు పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ సీన్ వేరుగా ఉందంటూ లోకేష్ చూపించిన ఈ 12 నెలల టైమ్‌లైన్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చకు దారితీసింది. వేగవంతమైన క్లియరెన్స్‌లు, సిస్టమ్‌లో స్పీడ్ తోడైతే ప్రాజెక్టులు ఎంత ఫాస్ట్‌గా గ్రౌండ్ అవుతాయో చెప్పేలా ఈ అప్డేట్ ఉంది.
ఆ ప్లాంట్ ఏది అంటూ లోకేష్ వేసిన ప్రశ్నతో నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్యూరియాసిటీ ప్రారంభం అయింది. ఏపీకి మరిన్ని పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications