Hyderabad: గుడ్ న్యూస్.. కొద్ది నెలల్లోనే హైదరాబాద్‌లో అందుబాటులోకి 6.2 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్..
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గత 8 ఏళ్లు కొనసాగుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కారిడార్ లో భాగంగా మొత్తం 148 పిల్లర్లు నిర్మించాలి ఉండగా.. 144 పిల్లర్లు నిర్మించారు. మరో నాలుగు పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. అయితే దసరా నాటికే ఈ ఎలివేటెడా కారిడార్ అందుబాటులోకి వస్తుందని చెప్పినప్పటికీ తాజాగా దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి పనులు పూర్తవుతాయని ప్రకటించారు.
మ్యాన్‌పవర్‌ను పెంచి మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ ఎలివేటెడ్ కారిడర్ పనులు ప్రారంభమై 8 ఏళ్లు గడిచినప్పటికీ 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో మంత్రి ప్రత్యేక చోరువ తీసుకుని అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పనులు పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి పలు సమీక్షలు చేశారు. దీంతో పనుల్లో కొంత వేగం పెరిగింది. మంత్రి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి 2025, జులై 16న పనులను పరిశీలించి.. దసరా నాటికే పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు.

ఆ తర్వాత 2025, నవంబరు 19న మేడారం జాతర సందర్భంగా క్షేత్రస్థాయిలో పనులను సమీక్షించారు. 2026 దసరా నాటికి పూర్తి చేస్తామన్నారు. తాజాగా మండలిలో ఓ సభ్యుడి అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2027 జూన్ నాటికి పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వేగంగా పనులు సాగుతున్నాయి. ఉప్పల్ రింగురోడ్డులో నాలుగు పిల్లర్ల నిర్మాణ పనులు కానసాగుతున్నాయి.
ఇవి పూర్తయ్యాక రింగురోడ్డులోని మెట్రో రైలు మార్గం పైనుంచి రామంతాపూర్ వైపు 200 మీటర్ల పొడవుతో కారిడార్ పనులు చేపట్టనున్టన్లు మంత్రి తెలిపారు. ఇక్కడ సుమారు 75 అడుగుల ఎత్తులో నిర్మాణం చేపట్టాలని గుర్తు చేశారు. ఉప్పల్ జంక్షన్‌లోనే వాహనాలు ఎక్కడానికి, దిగడానికి ర్యాంపుల నిర్మాణం చేస్తారని తెలిపారు. రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. 2020 పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 6.2 కి. మీ. దూరం, 6 లేన్ల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.626.76 కోట్లుగా ఉంది. జూన్ నాటికి ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి అయ్యే విధంగా పనులు చేపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
