ISRO News: గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. వాటి గురించి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా మాట్లాడారు.
భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్ తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి అనుకూలమైన రాజకీయ మద్ధతు లేకపోవటం వల్ల పురోగతి కుంటుపడిందని పేర్కొన్నారు. మోదీ రాకతో పరివర్తనను గుర్తు చేశారు. ప్రైవేట్ మార్గాల నుంచి పెరుగుతున్న పెట్టుబడులతో పాటు యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం గురించి ఆయన మాట్లాడారు.

స్పేస్ స్టార్టప్ రంగం వృద్ధి గురించి సింగ్ ప్రస్తావించారు. 2019లో కేవలం ఒక సంస్థ నుంచి ఇప్పుడు స్పేస్ రంగంలో 190 కంపెనీలకు పెరిగాయని పేర్కొన్నారు. నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని.. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను పొందినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుకు కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది.
వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో సేవలను ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, USA ఉన్నాయి. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు.

వాయిదా పడిన గగన్‌యాన్ మిషన్ 2025 ప్రారంభంలో అంతరిక్షంలోకి మానవరూప రోబోట్‌ను పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి మాట్లాడారు.


Click it and Unblock the Notifications