ముంబై: మైనింగ్ జెయింట్ వేదాంత రిసోర్స్ లిమిటెడ్.. తన షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారికి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడం ఇది రెండోసారి. కంపెనీ లాభాలను ఆర్జించిన నేపథ్యంలో వేదాంత ఈ నిర్ణయం తీసుకుంది. రెండోసారి మధ్యంతర డివిడెండ్లను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది.
ఈ డివిడెండ్ విలువ మొత్తంగా 5,019 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క షేర్ హోల్డర్‌కు ఈ మొత్తాన్ని డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ఒక్కో షేర్‌పై రూ.13.50 పైసలను డివిడెండ్‌గా చెల్లిస్తుంది. ఈ మేరకు ఈ సాయంత్రం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రతిపాదనలను ఫైల్ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి దశలవారీగా డివిడెండ్ చెల్లింపులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. వేదాంత ఆధీనంలో ఉన్న హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ కిందటి వారం ఒక బిలియన్ డాలర్ల పేఅవుట్‌ను ప్రకటించింది.

షేర్ హోల్డర్లకు ఇదివరకు వేదాంత యాజమాన్యం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈ మొత్తాన్ని విడుదల చేసింది. దీని విలువ 6,877 కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేదాంత రిసోర్స్ లిమిటెడ్ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. తొలి రెండు త్రైమాసికాల్లోనూ అంచనాలకు మించి ఆదాయాన్ని ఆర్జించింది. సెప్టెంబర్‌లో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకంగా అయిదు రెట్ల ఆదాయాన్ని నమోదు చేసిందా కంపెనీ. దీనితో షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై వేదాంత బోర్డు డైరెక్టర్లు ఆమోద ముద్ర వేశారు. శుక్రవారం నాడు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వేదాంత షేర్లు రూ.349.75 పైసల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ కంపెనీ షేర్లకు సెకెండరీ ఇన్వెస్టర్ల తాకిడి నెలకొంది. కంపెనీపై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సెకెండరీ కింద వేదాంత షేర్లను కొనుగోలు చేయడానికి మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కంపెనీ వ్యూహాలను మార్చుకోవడం, డీమెర్జింగ్, స్పిన్ ఆఫ్స్ వంటి నిర్ణయాలు కంపెనీని లాభాలబాట పట్టించాయని చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications