Anil Agarwal: మైనింగ్ కుబేరుడు అనిల్ అగర్వాల్ చిప్ తయారీ రంగంలో ఎదగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగం కావాలని నిర్ణయించి దీనికోసం దాదాపు 19 బిలియన్ డాలర్లతో ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అయితే ఈ వ్యాపారి తన కలను నెరవేర్చుకోవటానికి అసలు అడ్డంకులు ఇప్పుడే మెుదలయ్యాయి. ముందుగా ఆయనను ఇబ్బంది పెడుతోన్న అతిపెద్ద సమస్య దీనికోసం సాంకేతిక భాగస్వామిని కనుగొనలేకపోవటం. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందటంలో సవాళ్లను ఎదుర్కొంటూ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అగర్వాల్.

దీనికి ముందు అనిల్ అగర్వాల్ తన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్, తైవాన్‌కు చెందిన హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో మధ్య చిప్ భాగస్వామ్యాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన ఏడు నెలల తర్వాత వెంచర్ ఇంకా ఫాబ్రికేషన్ యూనిట్ ఆపరేటర్ లేదా లైసెన్స్ తయారీ-గ్రేడ్ టెక్నాలజీతో టై అప్ కాలేదని సమాచారం. చిప్ తయారీ అనేది ఖర్చుతో కూడుకున్న కాంప్లెక్స్ బిజినెస్.. దీనికి నైపుణ్యం అనేది చాలా కీలకమని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం అనిల్ అగర్వాల్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆయన సంస్థల అప్పుల విషయంలో కొన్ని ఆందోళనలు మార్కెట్లో వైరల్ అవుతున్నాయి. కమోడిటీస్ వ్యాపారంలో భారీ అప్పుల భారం నుండి బయటపడటానికి కష్టపడుతున్నారు.. ఈ క్రమంలో అగర్వాల్ భారీ కల నెరవేరాలంటే ప్రభుత్వం నుంచి నిధులను, ప్రోత్సాహకాలను పొందటం చాలా కీలకమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఆందోళనలపై కంపెనీ స్పందిస్తూ.. ప్లాంట్ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం సాంకేతిక భాగస్వామిని గుర్తించామని వెల్లడించింది. అయితే భాగస్వామి ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ చిప్ మార్కెట్లో భారత్ చేరాలని ఆకాంక్షించిన మోదీ ప్రభుత్వం ఇందుకోసం ప్రతిష్టాత్మకంగా 10 బిలియన్ డాలర్ల డ్రైవ్‌ను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications