Rocket Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని కంపెనీల షేర్లు భారీగా లాభపడటం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హఠాత్తుగా ధరల పెరుగుదలకు కారణం తెలుసుకున్న ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనేందుకు ఎగపడ్డారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మినీ రత్న కంపెనీ SJVN షేర్లలో నమోదైన బలమైన పెరుగుదల గురించే. నేడు మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు 13 శాతానికి పైగా పెరిగి రూ.115.45కు చేరాయి. పెరుగుదలకు అసలు కారణం కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ కోసం పెద్ద ఆర్డర్‌ను పొందటమే. SJVN రెన్యూవబుల్ ఎనర్జీ విభాగం SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఈ ఆర్డర్‌ను అందుకుంది. 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కంపెనీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందుకుంది.

సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు అభివృద్ధికి తాత్కాలిక వ్యయం దాదాపు రూ.2,700 కోట్లుగా అంచనా వేయబడిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఖవ్రాలోని GIPCL సోలార్ పార్క్‌లో అభివృద్ధి చేయబడుతుంది. ఈ ఏడాది జనవరి 25న టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ నుండి 500 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గెలుచుకుంది. కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను బిల్డ్ ఓన్ అండ్ ఆపరేట్ ప్రాతిపదికన యూనిట్‌కు రూ.2.54 టారిఫ్‌తో పొందింది.
ప్రభుత్వ కంపెనీ మెగా ఆర్డర్ అందుకున్న వేళ కంపెనీ షేర్లలో దూకుడు మెుదలైంది. ఏడాది కాలంలో మినీ రత్న కంపెనీ SJVN షేర్లు ఒక సంవత్సరంలో 265% పైగా పెరిగాయి. మార్చి 14, 2023న కంపెనీ షేర్లు రూ.31.48 వద్ద ఉన్నాయి. ఏడాది తర్వాత SJVN షేర్లు మార్చి 14,2024న రూ.115.45కి చేరుకున్నాయి. అలాగే గడచిన 6 నెలల కాలంలో షేర్లు 48% పైగా పెరిగాయి. ఈ క్రమంలో షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి ధర రూ.170.45గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ.30.39గా నమోదైంది. నాలుగేళ్ల కాలంలో కంపెనీ షేర్ధర రూ.20.35 నుంచి 470 శాతం పెరిగి రూ.115.45కి చేరుకున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications