Grandpa Will: మానవ సంబంధాలన్నీ మనీతో ముడిపెట్టేస్తున్న రోజులివీ. అందుకే మానవత్వం విలువను తన మనవరాళ్లకు తెలియచేయాలి అనుకున్నాడో మిలియనీర్ తాతయ్య. కట్ చేస్తే తన వీలునామాతో వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
లండన్‌లో నివసించిన రిటైర్డ్ సైనికుడు ఫ్రెడరిక్ వార్డ్ సీనియర్ 2020లో మరణించారు. దాదాపు 8 కోట్లకు పైగా సంపద ఆయన సొంతం. దానిపై ఇప్పుడు ఆయన బంధువులు కోర్టులో పోరాడుతున్నారు. ఆయన రాసిన వీలునామా వారి మధ్య కుటుంబ కలహాలకు దారితీసింది. ఎందుకంటే తన ఎస్టేట్‌లో సింహభాగాన్ని తన ఇద్దరు పిల్లలు టెర్రీ వార్డ్ మరియు సుసాన్ విల్ట్‌షైర్‌లకు అందించాలని అందులో పేర్కొన్నారు.

మరణించిన తన మరో కుమారుడు ఫ్రెడ్ జూనియర్ కూతుళ్లకు తన ఆస్తిలో వాటా ఇవ్వకూడదంటూ 2018లో వీలునామాను సవరించారు. వారికి ఒక్కొక్కరికి కేవలం 8 వేలు మాత్రమే అందించాలని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కారణంగా మూడు సార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు మనవరాళ్లు తనను పరామర్శించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమ తాత వీలునామాను ఆ మనవరాళ్లు కోర్టులో సవాలు చేశారు. ఆయన సంపదలో వాటాకు తాము కూడా అర్హులమేనని వాదిస్తున్నారు. తమ తండ్రి జీవించి ఉంటే కచ్చితంగా షేర్ వచ్చేదని చెబుతున్నారు. టెర్రీ మరియు సుసాన్‌లు ఆయనను బలవంతం చేసి ఆ విధంగా రాయించి ఉంటారని ఆరోపించారు. తాతయ్య మానసిక సామర్థ్యంపైనా అనుమానం వ్యక్తం చేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications