Milk Prices: మరుగుతున్న పాల ధరలు.. 8 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న సమస్యలు
Milk Prices: ప్రస్తుతం దేశంలో పాల ద్రవ్యోల్బణం పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో గుజరాత్ సంస్థ అమూల్ పాల విక్రయాలను చేపట్టాలని నిర్ణయించటంతో రాజకీయ దుమారం పెరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమూల్, నందిని పాల బ్రాండ్ల మధ్య పెద్ద పోటీకి తెరలేపింది.
తాజాగా విడుదలైన వినియోగదారుల ధరల సూచీ సమాచారంలో పాలు, పాల ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 9.31 శాతంగా ఉంది. 2023 సంవత్సరం మెుదటి త్రైమాసికంలో ఇది 9.25 శాతంగా ఉంది. 2014 అక్టోబర్-డిసెంబర్ తర్వాత పాల ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండటం ఇదే తొలిసారి. సీపీఐ ద్రవ్యోల్బణం బాస్కెట్లో పాలు, పాల ఉత్పత్తులకు 6.62 శాతం వాటా కలిగి ఉంది.

ప్రధానంగా పశువుల దాణా ఖర్చులు విపరీతంగా పెరగటంతో పాల ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని చాలా డెయిరీలు గత కొన్ని నెలలుగా పాల ధరలను క్రమంగా పెంచుతున్నాయి. పశుగ్రాసం ద్రవ్యోల్బణం రెండకెలను తాకటంతో చాలా మంది రైతులు పాత ఉత్పత్తికి దూరంగా జరుగుతున్నారు.
2020 ప్రారంభంలో కరోనా సమయంలో డెయిరీ ఉత్పత్తులకు దేశంలో డిమాండ్ భారీగా తగ్గింది. ఆ సమయంలో రైతులు ఖర్చులను తగ్గించుకునేందుకు తమ వద్ద ఉండే పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. అలాగే పాలు ఇవ్వని దూడలు, గర్భిణీ పశువులకు తక్కువ మేత కూడా ఇవ్వడం ప్రారంభించారు. అలా అవి షోషకాహారానికి దూరమయ్యాయి. ఆ ప్రభువం ఇప్పుడు తక్కువ పాల ఉత్పత్తికి పరోక్షంగా కారణమైందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో దేశంలోని చాలా డెయిరీలు తక్కువ పాల సేకరణను చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంస్థలు ఇతర దేశాలకు తమ పాల ఉత్పత్తులను సరఫరా చేసి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. దీనికి తోడు పశువులకు సోకిన వ్యాధులు పాల ఉత్పత్తిని తగ్గించాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా అందించేందుకు పాలను దిగమతి చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications