మిడిల్ ఈస్ట్‌కు చమురు ధరల దెబ్బ: ఇదీ ఇరాక్, సౌదీ దేశాల పరిస్థితి, ఆ దేశాలు చిన్నాభిన్నం

కరోనా మహమ్మారి కారణంగా వారు వీరు అని లేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి లేదా వేతనాలు కట్ చేస్తున్నారు. వేతనాలు లేక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో 80 కోట్లమంది పేదలకు భారత్ వంటి దేశాలు 3 నెలల పాటు ఉచిత బియ్యం, పప్పు, ఉచిత గ్యాస్, బ్యాంకు అకౌంట్‌లో కొంత మొత్తం వేస్తున్నాయి. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి.

చమురు ధరలు డౌన్.. ఇదీ ఆయా దేశాల పరిస్థితి

చమురు ధరలు డౌన్.. ఇదీ ఆయా దేశాల పరిస్థితి

మిలియన్ల కొద్ది ప్రభుత్వ ఉద్యోగులు ఆధారపడిన ప్రభుత్వ ప్రయోజనాలలో కోత విధిస్తోంది ఇరాక్. సౌదీ అరేబియా వంటి దేశం మెగా ప్రాజెక్టులను ఆలస్యం చేసే పరిస్థితి. ఈజిప్ట్, లెబనాన్ దేశాల పరిస్థితి అలాగే ఉంది. ఇతర దేశాల్లో ఉండే ఈ దేశాల కార్మికులు నిధులు పంపించకపోవడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. కరోనా వల్ల డిమాండ్ తగ్గి గత మూడు నాలుగు నెలలుగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో క్రూడ్ పైన ఆధారపడిన మిడిల్ ఈస్ట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి.

వృద్ధి రేటు మందగింపు

వృద్ధి రేటు మందగింపు

ఈ ఏడాది అరబ్ గల్ఫ్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్స్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇరాక్ వృద్ధి 5 శాతం ఉంటుంది. కొన్ని గల్ఫ్ దేశాలు ఫారన్ కరెన్సీ రిజర్వ్‌లపై ఆధారపడతాయి. 90 శాతం బడ్జెట్ చమురుపై ఆధారపడిన ఇరాక్ వంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి దారణంగా ఉంది. వీక్ ఎకానమీ, అవినీతిపై కొద్ది నెలల క్రితం ఇరాక్ అట్టుడికింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటున్నారు.

చమురు.. ఢీలా

చమురు.. ఢీలా

ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 20 డాలర్లకు కాస్త అటు ఇటుగా ఉంది. రెండు దశాబ్దాల్లో తొలిసారి చమురు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. చమురు మార్కెట్‌లో ధరలు మరింతగా కుంగిపోకుండా ఉండేందుకు ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని కూడా నిర్ణయించాయి. ఇప్పటికే చాలా దేశాల్లో ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలు దాదాపు నిండిపోయాయి. మరోవైపు డిమాండ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ఉత్పత్తి దేశాలు క్రూడ్‌ను మార్కెట్ చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇదీ ఇరాక్ పరిస్థితి..

ఇదీ ఇరాక్ పరిస్థితి..

2020 ఇరాక్ బడ్జెట్‌లోను పెద్ద మొత్తం చమురు నుండే ఉంది. బ్యారెల్ ధర 56 డాలర్ల ప్రకారం లెక్కించి రెవెన్యూ అంచనాలు వేసుకుంది. కంపన్సేషన్, పెన్షన్స్‌కు 54 బిలియన్ డాలర్లు కేటాయించింది. క్రూడ్ నుండి ఆదాయం 50 శాతానికి పైగా పడిపోయిందని ఇటీవల మంత్రి తమీర్ గద్భన్ తెలిపారు. అధికారులు ఇప్పుడు వేతనాలు కట్ చేసే అంశంపై చర్చిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పబ్లిక్ సెక్టార్ వర్కర్స్ ప్రయోజనాలు తగ్గించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఎక్కువ ఆదాయం కలిగిన వారు 50 శాతం తీసుకోవాలని కూడా సూచనలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే మిలియన్ల కొద్ది డాలర్లు మిగలవచ్చు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే గతంలో అట్టుడికిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొచ్చు.

సౌదీ అరేబియా పరిస్థితి

సౌదీ అరేబియా పరిస్థితి

అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా ఖర్చులు 5 శాతం లేదా 13.3 బిలియన్ డాలర్లు తగ్గించాలని భావిస్తోంది. ముందు ముందు మరిన్ని కోతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చమురు ధరలు భారీగా పడిపోవడంతో మెగా ప్రాజెక్టులు వంటివి ఆలస్యం కానున్నాయి. కరోనా కారణంగా విదేశీ పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి.

కువైట్‌లో తగిన నిల్వలు ఉన్నాయి.

ఐజ్‌లాండ్ నేషన్ బహ్రెయిన్ డెబిట్స్ జీడీపీలో 105 శాతం సమానమని అంచనా. ఇతర చమురు ఉత్పత్తి దేశాల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఉద్యోగాలు పోయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.

అమెరికా వంటి దేశాల్లోనే కోట్లాది మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+