గల్ఫ్ దేశాలు అంటేనే సంపన్న దేశాలుగా మనకు తెలుసు. ప్రపంచానికంతా ఆయిల్ సరఫరా చేస్తూ... అతి కొద్ది సమయంలోనే అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకున్నాయి. ఆ సంపదకు మూల కారణం కేవలం చమురు మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఒక కొత్త చిక్కొచ్చి పడుతోంది. అతి త్వరలోనే ఆయా దేశాల్లోని రూ లక్షల కోట్ల సంపద ఆవిరి కాబోతోంది. అప్పుడు సంపన్న దేశాలుగా ఎదిగేందుకు కారణమైన అదే చమురు... ఇప్పుడు వాటి ఐశ్వర్యాన్ని కబళించేందుకు కూడా కారణం అవుతుండటం విధి వైచిత్రి. మన దేశంలో నీళ్ల బావులు ఉన్నట్లు గల్ఫ్ లో చమురు బావులు ఉంటాయని చాలా మంది చెబుతుండేవారు.
బతుకు దెరువు కోసం మన దేశం నుంచి లక్షల సంఖ్యలో జనాలు ఉపాధి కోసం అక్కడి వలస వెళ్ళేవాళ్లు. కానీ ఇటీవల కొన్నేళ్లుగా అక్కడ పరిస్థితులు అంతగా బాగోలేవు. కొత్త ఉద్యోగాలు రావటం లేదు. ఉన్నవి కూడా ఊడుతున్నాయి. అందుకే, ఇటీవల 2-3 ఏళ్లలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళినవాళ్ళు ... మళ్ళీ ఇంటి దారి పడుతున్నారు. అంటే అక్కడ ఏదో ముసలం మొదలైందన్నమాట.

15 ఏళ్లలో మొత్తం ఖాళీ...
ప్రస్తుతం అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న గల్ఫ్ దేశాలు అతి త్వరలోనే అతిపెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కోబోతున్నాయి. వచ్చే 15 ఏళ్లలో అక్కడ 2 లక్షల ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 140 లక్షల కోట్లు) సంపద ఆవిరి కాబోతోంది. ఈ విషయాన్నీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ ఒక కథనం ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గటం వల్ల ఈ ప్రమాదం ముంచుకు వస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆరు సభ్య దేశాలు గల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసిసి) కి దీంతో పెను ప్రమాదం సంభవించనుంది.
2034 నాటికీ ఇలా నికర ఆర్థిక విలువను కోల్పోయే ఈ దేశాలు... మరో పదేళ్లలో చమురు రహిత సంపద మొత్తాన్ని కోల్పోతాయని నివేదికలో వెల్లడైంది. చమురు సరఫరా, డిమాండ్ అంశాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకోవటం వల్ల జీసిసి దేశాలు దీర్ఘకాలిక వ్యూహాల గురించి సీరియస్ గా ఆలోచించాలని ఐఎంఎం మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఆసియా డిపార్ట్మెంట్ డైరెక్టర్, జిహాద్ అఝావోర్ సూచించారు.

ఇతర అంశాలపై ఫోకస్...
చమురుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు వీలైనంత త్వరగా ఇతర రంగాల పై ద్రుష్టి సారించాల్సి ఉంటుంది. చమురేతర రంగాలపై ద్రుష్టి సారించాలి. ప్రస్తుతం ఈ దేశాల వద్ద ఉన్న సంపదను కాపాడుకోవాలంటే... నయా ఆర్థిక ప్రణాళికలు అవసరం. ఉద్యోగాల సృష్టి జరగాలి.
ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు మెరుగవ్వాలి. ఆయా దేశాలకు సరిపోయే ఇతర పరిశ్రమలు స్థాపించాలి. తయారీ రంగాన్ని, పర్యాటకం వంటి ఇతర రంగాలను కూడా ప్రోత్సహించాలి. అప్పుడే ప్రస్తుత సంపాదన కాపాడుకుంటేనే... కొత్త ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవచ్చు. లేదంటే ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపు వెళ్లకుండా రక్షించుకోవటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలతో చెక్..
ప్రపంచమంతా ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తోంది. ఇందుకోసం సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది వచ్చే 5-10 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. అప్పుడు క్రమంగా చమురును డిమాండ్ తగ్గటం ప్రారంభం అవుతుంది.
దీంతో, కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడిన గల్ఫ్ దేశాలకు మనుగడ కష్టతరమవుతుంది. ఈ ఆరు సభ్య దేశాలు కలిసి ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు ఐదో వంతు సమకూరుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల రాక, వినియోగం ఊహించినదానికంటే అధికంగా ఉండటంతో చమురును చెక్ పెట్టినట్లు అవుతోంది. 2041 తర్వాత చమురు కు క్రమంగా డిమాండ్ తగ్గిపోతుందని ఐఎంఎం అంచనా వేస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications