సామాన్యుడికి అందని ద్రాక్షగానే సొంతింటి కల..జీవితమంతా ధనవంతుల ఇళ్లను చూస్తూనే..

దేశంలో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. కార్పోరేట్ వర్గానికి బాటలు పరుస్తోంది. సామాన్యులకు సొంత ఇల్లు కల అందని ద్రాక్షలాగానే ఉంది. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మధ్యతరగతి జీవులు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పరిస్థితులు సహకరించడం లేదు. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిందకు దిగిరానంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో రియాల్టీ రంగం అంతా కార్పోరేట్ వైపే నడుస్తోంది. ధరలు చూసిన సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

దేశంలో ప్రతి ఒక్కర సొంతిల్లు కలిగి ఉండాలని ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీనికి కారణం ప్రజల ఆదాయానికి, ఇళ్ల ధరలకు మధ్య గల గ్యాప్‌ అందనంత దూరం పెరిగిపోవడమే. 2020 నుండి 2024 మధ్య కాలంలో సామాన్యుడి ఆదాయం కన్నా రెండు రెట్లు ఇళ్ళ ధరలు పెరిగాయి. ఇండియాలో సగటు కుటుంబ ఆదాయం సంవత్సరానికి కేవలం 5.4% CAGR రేటుతో పెరిగితే.. ప్రాపర్టీ ధరలు మాత్రం ఏకంగా 9.3% CAGR రేటుతో పెరిగాయి. అంటే ఆదాయం కన్నా రెండు రెట్లు వేగంగా ఇళ్ల ధరలు దేశంలో పెరిగాయి.

India housing crisis middle class home affordability real estate prices India housing market India 2025 unaffordable homes India Indian middle class real estate home buying struggle India real estate inequality Indian housing policy urban housing India India middle class problems

కొత్తగా వచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే.. 2022లో భారతదేశం మొత్తంగా 3.1 లక్షల అఫోర్డబుల్ హౌసింగ్ యూనిట్లు (రూ.1 కోటి లోపు) అందుబాటులో ఉన్నాయి. అయితే 2024కి వాటి సంఖ్య వాటి 36% తగ్గి 1.98 లక్షలకి చేరుకున్నాయి. ఈ సమయంలో లగ్జరీ హౌసింగ్ మాత్రం బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రా వారీగా చూస్తే.. డిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో 192% పెరుగుదల నమోదు కాగా సిలికాన్ సిటీ బెంగుళూరులో 187% పెరుగుదల నమోదైంది. ఇక చెన్నైలో చూసుకున్నట్లయితే.. 127% పెరుగుదలను చూసింది.

ఇక హైదరాబాద్ నగరంలో అఫోర్డబుల్ హౌసింగ్ (సామాన్యులకు అందుబాటులో ఉండే ఇల్లు) 69% తగ్గగా.. ముంబైలో 60% తగ్గింది. అదే సమయంలో NCR 45% తగ్గింది. కేవలం కోల్‌కతా మాత్రమే ఈ రంగంలో 7% వృద్ధి చూపించింది. సామాన్యుడు తనకు వచ్చే ఆదాయంతో దేశంలో ఇల్లు కొనాలంటే.. ముంబైలో సగటున 14 సంవత్సరాలకు పైగానే పడుతుంది. ఇక ఢిల్లీలో 10 సంవత్సరాలకు పైగానే పడుతుంది. ఒక వేళ ధైర్యం చేసి ఇల్లు కొన్నా అతనికి వచ్చే జీతంలో ఎక్కవ శాతం లోన్ ఈఎమ్ఐకే వెళ్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కార్పోరేట్ల దగ్గర ఉన్న నల్ల డబ్బు. డెవలపర్లు సర్కిల్ రేట్‌ను తగ్గించి చూపించి మిగతా డబ్బును నేరుగా క్యాష్‌లో తీసుకుంటున్నారు.

దీనికి పరిష్కార మార్టం ఏమైనా ఉందా అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. వారు ఏం చెబుతున్నారంటే.. సర్కిల్ రేట్లు ప్రతినెలా అప్‌డేట్ కావాలి.అలాగే రెరా ద్వారా డిజిటల్ సేల్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ రావాలని కోరుతున్నారు. దీంతో పాటుగా ఖాళీ ఇళ్లపై వేకెన్సీ ట్యాక్స్ అమలు చేయాలని సూచిస్తున్నారు. NRI ఇన్వెస్ట్‌మెంట్లపై నియంత్రణలు ఉండటం. టైర్ 2, టైర్ 3 నగరాల్లో హౌసింగ్ ప్రాజెక్టుల పెంపుదల అవసరమని చెబుతున్నారు. సామాన్యుడికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. అయితే ప్రస్తుతం అది లగ్జరీగా మారిపోతోంది. దీంతో అతను ఇల్లు లేని వాడిగా మాత్రమే మిగిలిపోతున్నాడు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+