Bengaluru Real Estate News: భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో ఇల్లు కొనాలంటే ఎవరైనా కోటీశ్వరుడు అయి ఉండాలని అంటారు. ఎందుకంటే ఇటీవల నగరంలోని గృహ మార్కెట్‌లో పెను మార్పు కనిపిస్తోంది. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితిని పరిశీలిస్తే దేశ గృహనిర్మాణ అభివృద్ధి ఎవరి కోసం అనే ప్రశ్న తలెత్తుతుంది.
2025 మొదటి త్రైమాసికంలో, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 9 శాతం తగ్గాయి. రూ.50 లక్షల నుండి రూ.1 కోటి మధ్య ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు కూడా 6 శాతం తగ్గాయి. అదే సమయంలో రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయి. ఇక రూ.50 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 483 శాతం పెరిగాయి. ఇది లగ్జరీ హౌసింగ్ రంగం యొక్క భారీ వృద్ధికి నిదర్శనం.
భారతదేశంలో మొత్తం గృహ అమ్మకాలలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా ఇప్పుడు 46 శాతంగా ఉంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ రాజ్‌దీప్ చౌహాన్ లింక్డిన్ లో పోస్ట్ చేస్తూ పలు విషయాలను పంచుకున్నారు. రూ. 25 లక్షల జీతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ముంబై, బెంగళూరు లేదా NCRలో 2BHK ఇల్లు కట్టుకోలేకపోతున్నాడని తెలిపారు.

ఇది మనం ఇళ్లు నిర్మిస్తున్నామా లేదా అసమానతనా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని ఆయన "బార్‌బెల్ ఎకానమీ"గా అభివర్ణించారు. అంటే రియాల్టీ డెవలపర్లు ధనవంతులకు లేదా పేద వారికి మాత్రమే ఇళ్లను నిర్మిస్తున్నారు. మధ్యతరగతికి సరసమైన ఎంపికలు లేకుండా పోతున్నాయని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. రూ.50 లక్షల లోపు కొత్త ఇళ్ల సంఖ్య 31 శాతం తగ్గింది. బెంగళూరులో ఈ తగ్గుదల 85 శాతంగా ఉంది. ఇది 2018 స్థాయిలతో పోలిస్తే అత్యల్పంగా చెప్పుకోవచ్చు. ముంబైలో ఇది 11శాతం కాగా కోల్‌కతాలో 67 శాతంగా ఉంది. మధ్యతరగతి వారి కోసం నిర్మించబడుతున్న ఇళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఈ లెక్కలు చెబుతున్నాయి.
ఇటీవలి రియల్ ఎస్టేట్ పరిణామాలు గమనిస్తే.. ధనవంతులు మాత్రమే రియాల్టీలో చురుగ్గా ఉన్నారని తెలుస్తోంది. మధ్యతరగతి వారు సరసమైన గృహాలను కొనడంలో వెనక్కి తగ్గుతున్నారు. ఇల్లు కొనడానికి ఆర్థిక వనరులు, తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ.. రూ.1 కోటి కంటే తక్కువ ధర గల గృహాల సరఫరా లేకపోవడం వల్ల వారు వెనుకబడిపోతున్నారు.
కాగా ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలు జనాభాలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ డెవలపర్లు సరసమైన, బడ్జెట్-స్నేహపూర్వక గృహాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. భారతదేశ జనాభాలో ఎక్కువ మంది మధ్యతరగతి వారు సొంతిల్లు అనేది కలపైనే జీవించాల్సి రావచ్చు. గృహనిర్మాణ అభివృద్ధి వాస్తవికతకు, సమతుల్యతకు అనుగుణంగా ఉండాల్సిన సమయం ఇదని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications