Multibagger Stock: దేశంలో కరోనా ప్రారంభంలో ఈక్విటీ మార్కెట్లు క్రాష్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత భారతీయ మార్కెట్లలో ఒక్కసారిగా బుల్స్ ర్యాలీ స్టార్ట్ అయ్యింది. ఆ జోరులో పాల్గొన్న అనేక స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారిని ధనవంతులుగా మార్చేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ట్రాన్స్‌ఫార్మర్స్ & రెక్టిఫైయర్స్(ఇండియా) లిమిటెడ్(TRIL) షేర్ల గురించే. ఒకప్పుడు పెన్నీ స్టాక్ గా ఉన్న ఈ కంపెనీ షేర్లు అనతికాలంలోనే తమ పెట్టుబడిదాలకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారిని ఏకంగా కోటీశ్వరులుగా మార్చేశాయి. అయితే నిన్న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి మాత్రం కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

గడచిన కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ధర మే 2020లో ఎన్ఎస్ఈలో రూ.6.30 స్థాయికి చేరుకున్నాయి. తర్వాత రికవరీ ట్రాక్‌లోకి వచ్చిన కంపెనీ షేర్లు ఏకంగా 100 రెట్లు పెరిగి రూ.626 స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇదంతా కేవలం నాలుగేళ్ల కాలంలో జరగటం గమనార్హం. దీర్ఘకాలికంగా కంపెనీ షేర్లలో పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం కోటీశ్వరులుగా మారిపోయారు. ఒక నెల కాలంలో TRIL షేర్ల ధర రూ.415.50 నుంచి రూ.626.50 స్థాయికి పెరిగాయి. అంటే నెలరోజుల్లో 50 శాతం రాబడిని నిలకడగా ఉండే పెట్టుబడిదారులు సంపాదించారు.
మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన స్టాక్ ఏడాది ప్రాతిపదికన గమనిస్తే గతంలో రూ.238 నుంచి ప్రస్తుతం రూ.626.50కి చేరాయి. అలాగే 2024లో స్టాక్ 160 శాతం రాబడిని అందించింది. గత ఆరు నెలల్లో TRIL షేరు ధర సుమారు రూ.161 నుంచి భారీ ర్యాలీని కొనసాగించి దాదాపు 300 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఆరు నెలల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.4 లక్షలకు చేరుకుని ఉండేది. అలాగే ఏడాది కిందట లక్ష ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు రూ.9.50 లక్షలు పొందేవారు. అలాగే 2020 మే నెలలో కరోనా కాలంలో స్టాక్ ధర రూ.6 చిల్లర దగ్గర ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.కోటిగా మారేది.


Click it and Unblock the Notifications