IT News: ప్రస్తుతం దేశంలోని ఐటీ కంపెనీలు వ్యాపార అనిశ్చితులతో పాటు నియామకాలను నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెద్ద టెక్ కంపెనీలైతే ఉద్యోగులకు వేతన పెంపులను వాయిదా వేశాయి.
ఈ సమయంలో మిడ్ క్యాప్ టెక్ కంపెనీలు మాత్రం తమ టెక్కీలకు బహుమతులు, ఉచితాలను అందిస్తూ వారిని ఖుషీ చేస్తున్నాయి. సైకిళ్లు, సూట్ కేసులు, ఐపాడ్స్, జిమ్ మెంబర్ షిప్స్ అంటూ అనేక వేరియబుల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ముందుగా టాటాలకు చెందిన Tata Elxsi తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు Cult.fit నుంచి తగ్గింపుకు మెంబర్ షిప్ అందిస్తోంది. జిమ్, యోగా, డాన్స్ క్లాసెస్, బాక్సింగ్ వంటి అనేక సౌలభ్యాలను ఇస్తోంది. దీనికి తోడు వారి మానసిక ఆరోగ్యం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కౌన్సిలర్లను అందుబాటులో ఉంచింది.

అలాగే మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన పర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీ ఇటీవల బిలియన్ డాలర్ల రెవెన్యూ మార్కును అందుకోవటంతో తమ టెక్కీలకు బైక్స్, ఇయర్ పాడ్స్, ట్రావెల్ యాక్సిసరీలను అందించింది. పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ఉద్యోగులు అందించిన అంకితబావానికి కృతజ్ఞతగా వీటిని ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 48.6 కోట్లను ఖర్చు చేసింది.
మరో మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ కొఫొర్జీ సైతం తన ఉద్యోగులను సత్కరించింది. Q4FY23లో కంపెనీ రెవెన్యూ బిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సందర్భంగా టెక్కీలకు ఆపిల్ ఐపాడ్స్ గిఫ్ట్ ఇచ్చింది. కంపెనీ దాదాపు 21,815 మందికి వీటిని అందించింది. ఇక చివరగా హెక్సావేర్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇటీవల 100 శాతానికి పైగా వేరియబుల్ వేతనాన్ని ప్రకటించింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న టెక్ ఉద్యోగుల కంటే మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులు మంచి ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు.


Click it and Unblock the Notifications