Linked In Layoff: కంపెనీలు ఇటీవల తొలగింపుల స్పీడ్ తగ్గించినప్పటికీ పూర్తిగా అయితే ఉద్యోగుల కోతలు ఆగలేదు. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇంకా ఫైరింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే ఈ ఏడాది మే నెలలో దాదాపు 700 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ లింక్డ్‌ఇన్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని మార్చిపోక ముందరే మరోసారి తాజాగా 668 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించటం ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. ఈసారి కంపెనీలోని ఇంజినీరింగ్ , టాలెంట్ , ఫైనాన్స్ టీమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులను కంపెనీ టార్గెట్ చేసింది. సోమవారం వెలువడిన ఈ వార్త కుదుట పడని వ్యాపార అనిశ్చితులకు అద్ధం పడుతోంది.

ప్రధానంగా అమెరికా, యూరప్ లోని టెక్ ఆధారిత కంపెనీలు పెద్ద ఎత్తున తమ ఉద్యోగులను తొలగించాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఏర్పడిన మాంద్యం భయాలతో పాటు తగ్గిన ఆదాయ దృష్ట్యా తప్పని పరిస్థితుల్లో కంపెనీలు కోతలకు దిగాయి. దీని ద్వారా వ్యయ బడ్జెట్లను తగ్గించి వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. దీంతో లక్షల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో టెక్నికల్ విభాగంలో 1,41,516 మంది ఉద్యోగులను తొలగించగా, ఏడాది క్రితం కేవలం 6000 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించారు.
లింక్డ్‌ఇన్‌లో దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 3 శాతం మందిని కంపెనీ తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 668 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. మే నెలలో ముందుగా లింక్డ్‌ఇన్ 716 మందిని తొలగించగా.. 2023లో కంపెనీ దాదాపు 1400 మంది ఉద్యోగులను తగ్గించింది. రానున్న కాలంలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications