ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రముఖ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్టువేర్ ప్రోడక్ట్స్ సంస్థ న్యూఆన్స్ కమ్యూనికేషన్స్ ఇంక్‌ను కొనుగోలు చేసింది. న్యూఆన్స్ కోసం మైక్రోసాఫ్ట్ 1970 కోట్ల డాలర్లను చెల్లించనుంది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.1.4 లక్షల కోట్లు. పూర్తి నగదు చెల్లింపు పద్ధతిలో ఈ కంపెనీని కొనుగోలు చేసింది. హెల్త్ కేర్ AI రంగంలో ఇప్పటి వరకు ఇది అతిపెద్ద ఒప్పందం.
డీల్‌లో భాగంగా మైక్రోసాఫ్ట్ ఒక్కో న్యూఆన్స్ స్టాక్ కోసం 56 డాలర్లు చెల్లించింది. గత శుక్రవారం ముగిసిన న్యూఆన్స్ షేర్ ధరతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. దీంతో సోమవారం న్యూఆన్స్ షేర్ ఇరవై శాతానికి పైగా దూసుకెళ్లింది. ఒక సంవత్సరంలో ఈ డీల్ పూర్తవుతుంది. అంతకుముందు 2016లో లింక్డిన్‌ను 26 బిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.గత ఏడాది సెప్టెంబర్ నెలలో వీడియో గేమ్ తయారీ సంస్థ జెనీమ్యాక్స్‌ను 7.5 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది.

వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే న్యూఆన్స్ AI ఆధారంగా స్పీచ్ రికగ్నేషన్ సాఫ్టువేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది. ఆరోగ్య రక్షణ, ఆటోమొబైల్‌తో పాటు అనేక రంగాల్లో డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన సిరి స్పీచ్ రికగ్ిషన్ సాఫ్టువేర్ హెల్త్ కేర్ రంగంలో విస్తృతంగా వాడుకలో ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications