టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఈ ఏడాది కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ తొలగింపులు చేపట్టాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరపబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈసారి టెక్ దిగ్గజం ప్రధానంగా Xbox డివిజన్‌ను లక్ష్యంగా చేసుకొని లేఆప్స్ స్టార్ట్ చేయనుంది. సంస్థ ఆర్థిక సంవత్సరాంతం (జూన్ 30)కి ముందు తీసివేతల కార్యక్రమం చేపట్టబోతోందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఇది గత 18 నెలల్లో మైక్రోసాఫ్ట్‌లో జరుగుతున్న నాల్గవ పెద్ద స్థాయి లేఆఫ్ కానుంది.
Xbox విభాగం అనేది గేమింగ్ రంగానికి చెందినది. గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియోలు, డిజిటల్ సేవలు (Game Pass వంటి వాటి)కి సంబంధించింది. ఈ విభాగంలో 2023లోనే మైక్రోసాఫ్ట్ కొన్ని గేమింగ్ కంపెనీలను మూసివేసి, పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. Activision Blizzard అనే కంపెనీని 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత, మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ వ్యూహాన్ని తిరిగి లైవ్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈసారి Xboxతో పాటు ఇతర విభాగాలు కూడా రానున్న లేఆప్స్ వల్ల ప్రభావితమయ్యే అవకాశముంది. ముఖ్యంగా గ్లోబల్ సేల్స్ ఆపరేషన్స్‌లో ఉన్న ఉద్యోగులు ఈ రౌండ్‌లో టార్గెట్ అయ్యే అవకాశముందని అనధికార వర్గాల సమాచారం. గత నెల మేలో కంపెనీ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌నే ఉద్యోగ తొలగింపులు ఎక్కువగా ప్రభావితం చేశాయి. సేల్స్, మార్కెటింగ్ విభాగాలు పెద్దగా ప్రభావితమవలేదు. ఈసారి అవి కూడా టార్గెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు వెనుక మైక్రోసాఫ్ట్ దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యంలో వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. సంస్థ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ సర్వీసులపై భారీగా పెట్టుబడులు పెట్టింది. కొత్త డాటా సెంటర్లు నిర్మించడం, AI ఆధారిత సేవలు అభివృద్ధి చేయడం కోసం ఖర్చు పెరుగుతుండటంతో, ఇతర విభాగాల్లో వ్యయాలను తగ్గించాలనే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.
ఏప్రిల్‌లో మైక్రోసాఫ్ట్ చిన్న, మధ్య తరహా బిజినెస్‌లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సేల్స్‌ని మూడో పార్టీ కంపెనీలకు ఔట్‌సోర్స్ చేస్తామని ప్రకటించింది. అంటే సంస్థ లోపల ఉద్యోగాల అవసరం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సుమారు 45 వేల మంది సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ లేఆఫ్ అధికారికంగా ప్రకటించబడకపోయినా, మైక్రోసాఫ్ట్ గతంలో workforce తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. సంస్థ పెట్టుబడిదారులకు, ఉద్యోగులకు కూడా ఖర్చులపై నియంత్రణ, సామర్థ్యంపై దృష్టి పెడతామని ఇటీవల తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications