మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాకిచ్చింది. అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10కి మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి విండోస్ 10 పై ఎటువంటి ఉచిత భద్రతా అప్ డేట్లు కాని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభించవని తెలిపింది. విండోస్ 10ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది.ఎందుకంటే భద్రతా అప్ డేట్లు లేకపోతే హ్యాకర్లు, మాల్వేర్‌లు, వైరస్‌లు సులభంగా కంప్యూటర్‌ను ధ్వంసం చేయవచ్చని హెచ్చరించింది.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మైక్రోసాఫ్ట్ కొన్ని కొత్త అవకాశాలను కూడా ప్రకటించింది. సాధారణ వినియోగదారులు తమ Windows 10 పరికరాలను భద్రతగా ఉంచుకోవాలంటే 30 డాలర్లు చెల్లించి అదనపు భద్రతా అప్ డేట్లను వచ్చే సంవత్సరం (2026 అక్టోబర్) వరకు పొందవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్. చాలా మంది ఈ ఆఫర్‌ను సరైనది కాదని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు విండోస్ 10పై భద్రతా Updates ఉచితంగా లభించేవి.

ఈ30 డాలర్లు చెల్లింపు కాకుండా మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకటి, విండోస్ బ్యాకప్ యాప్ ద్వారా మీ ముఖ్యమైన డేటాను OneDriveలో నిల్వ చేసుకోవడం. ఇది డేటాను భద్రపరచడంలో సహాయపడుతుంది. రెండవది Microsoft Rewards పాయింట్లు ఉన్నవారు 1000 పాయింట్లను రీడీమ్ చేసుకొని కూడా భద్రతా అప్ డేట్లను పొందడం..
అయితే, పబ్లిక్ ఇంటరెస్ట్ రీసెర్చ్ గ్రూప్ (PIRG) వంటి వినియోగదారు సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పాత పరికరాలు Windows 11కి అప్‌గ్రేడ్ కాలేనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల, మిలియన్ల కొద్దీ మంచి కంప్యూటర్‌లు చెత్తకుప్పల్లోకి వెళ్లే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయానికి, వ్యాపార సంస్థలు మూడు సంవత్సరాల పాటు పొడిగించిన భద్రతా మద్దతు పొందుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు మాత్రం ఒక్క సంవత్సరం మాత్రమే భద్రతా మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు సాంకేతిక నిపుణులు ఈ మద్దతును కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు అందించాలని, తద్వారా పాత పరికరాలను ఉపయోగించుకుంటూ భద్రతా సమస్యలు ఎదుర్కోవకుండా ఉంచవచ్చని అంటున్నారు.
ఇప్పుడైతే విండోస్ 10 వినియోగదారులు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 30 డాలర్లు చెల్లించి భద్రతా అప్ డేట్లు పొందడం, Microsoft Rewards పాయింట్లు ద్వారా మద్దతు పొందడం లేదా OneDrive లో డేటాను నిల్వ చేసుకోవడం మార్గాలుగా కనిపిస్తున్నాయి. మీ కంప్యూటర్ Windows 11కి అప్‌గ్రేడ్ చేయడం బెటర్. అయితే అన్ని పాత పరికరాలు దీనిని మద్దతు ఇవ్వవు. అందువల్ల, మీ పరికరానికి Windows 11 అనుకూలమా, లేదో పరిశీలించటం చాలా అవసరం. మొత్తానికి, భద్రతా అప్ డేట్లు లేకపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు ఎదురవ్వొచ్చు. అందుకే వినియోగదారులు ముందుగానే తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.


Click it and Unblock the Notifications