హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ ఆఫీస్ లీజ్ ఒప్పందం.. ఏకంగా రూ.5 కోట్లకు పైమాటే..

హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో కీలక లావాదేవీ జరిగింది. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా (R\&D) జూలై 2025 నుండి నగరంలోని ఫీనిక్స్ సెంటారస్ టవర్‌లో 264,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. టేబుల్ స్పేస్ టెక్నాలజీస్‌తో కుదుర్చుకున్న ఈ లీజు ఐదేళ్లపాటు కొనసాగుతుంది.

ప్రాప్‌స్టాక్ వెల్లడించిన లీజు డాక్యుమెంట్స్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ చదరపు అడుగుకు రూ. 67 చొప్పున నెలవారీ బేస్ రెంట్ రూ. 1.77 కోట్లు చెల్లించనుంది. అయితే, సాధారణ ప్రాంతాల నిర్వహణ (CAM), మెయింటెనెన్స్ ఖర్చులు, మూలధన వ్యయాలు, ఇతర ఫీజులను కలిపి కంపెనీపై మొత్తం నెలవారీ భారం రూ.5.4 కోట్లు (చదరపు అడుగుకు రూ. 204) అవుతుందని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి.ఈ లీజు 60 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి ఏడాది 4.8 శాతం రెంట్ పెరుగుదల ఉండనుంది. అదనంగా, మైక్రోసాఫ్ట్ రూ. 42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ఈ ఒప్పందం ద్వారా కంపెనీ భవనంలోని మూడవ, నాలుగవ అంతస్తులను ఆక్రమించుకోనుంది.

Microsoft Hyderabad office Microsoft office lease Hyderabad Hyderabad commercial real estate Hyderabad office space deal Microsoft India expansion Microsoft Hyderabad rental Hyderabad IT corridor offices Gachibowli office lease Hyderabad tech hub largest office deal Hyderabad Microsoft

ఈ ఒప్పందంలో టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ సబ్-లెస్సర్‌గా వ్యవహరిస్తోంది. అసలు భవన యజమాని ఫీనిక్స్ టెక్‌జోన్‌తో టేబుల్ స్పేస్ ఇప్పటికే రిజిస్టర్డ్ లీజ్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్‌కు ప్రీమియం వర్క్‌స్పేస్‌ను అందిస్తుంది. 1998లో Microsoft హైదరాబాద్‌లో తన ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను స్థాపించింది. ప్రస్తుతం ఇది US వెలుపల మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద R\&D సెంటర్ గా ఎదిగింది.

గచ్చిబౌలి క్యాంపస్‌లో ఇప్పటికే కృత్రిమ మేధస్సు (AI), ఇంజనీరింగ్, క్లౌడ్ ఆవిష్కరణలపై ప్రధాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫీనిక్స్ సెంటారస్‌లో తీసుకున్న ఈ కొత్త స్థలం అదనపు పరిశోధన & అభివృద్ధి (R\&D) బృందాలు, సాంకేతిక విభాగాలకు వేదిక కానుంది. ఇక హైదరాబాద్ ఐటీ రంగంలో ఒక ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మారుతోంది. ప్రతిభ లభ్యత, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చు ప్రయోజనం.. ఇవన్నీ పెద్ద టెక్ కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తున్నాయి.

నగరంలో సీనియర్ వర్క్‌స్పేస్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మాట్లాడుతూ ..ఇలాంటి భారీ లావాదేవీలు గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో స్థిరపడటమే కాకుండా, ప్రీమియం గ్రేడ్-ఎ స్పేస్‌లలో విస్తరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అని అన్నారు. ఈ లావాదేవీ హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో 2025లో అతిపెద్ద ఆఫీస్ లీజ్ ఒప్పందాలలో ఒకటి. ఇది నగరంలో పెద్ద టెక్ సంస్థలు కొనసాగుతున్న పెట్టుబడులను స్పష్టంగా చూపిస్తోంది.ఈ డీల్ రాబోయే నెలల్లో ఇతర టెక్ దిగ్గజాలు కూడా పెద్ద స్థలాలు అద్దెకు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+