Market Value: ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ బ్రాండ్‌కి, కంపెనీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత విలువైన కంపెనీగా ఏళ్లతరబడి టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. అయితే ఈ రికార్డుకి మరో దిగ్గజ IT కంపెనీ మైక్రోసాఫ్ట్ బ్రేకులు వేసి షాక్ ఇచ్చింది.
స్టాక్ మార్కెట్ విలువ పరంగా Appleని అధిగమించి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఆపిల్ డిమాండ్‌పై ఆందోళనలు తలెత్తడంతో ఈ ఫీట్ సాధ్యమైనట్లు తెలుస్తోంది. గత సెషన్‌లో మైక్రోసాఫ్ట్ 1 శాతం లాభపడగా.. ఆపిల్ స్టాక్‌లో 0.2 శాతం పెరుగుదల కనిపించింది. ఫలితంగా LSEG డేటా ప్రకారం ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.875 ట్రిలియన్ డాలర్లను మైక్రోసాఫ్ట్ అధిగమించి 2.887 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

స్మార్ట్‌ఫోన్ డిమాండ్ గురించిన ఆందోళనలు ఆపిల్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. గతేడాదిలో 48 శాతం పెరిగిన షేర్ల విలువ, 2024లో 3 శాతం మేర క్షీణించాయి. ఇదే సమయంలో 2023లో 57 శాతం వృద్దితో దూసుకుపోయిన మైక్రోసాఫ్ట్.. ఆపిల్‌కు విరుద్ధంగా కొత్త సంవత్సరంలో 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ChatGPT మేకర్ OpenAIలో పెట్టుబడితో కృత్రిమ మేధస్సు విభాగంలో అగ్రగామిగా ఎదిగినట్లు తెలుస్తోంది.
తన ఉత్పాదకత సాఫ్ట్‌వేర్ సూట్‌లో OpenAI సాంకేతికతను మైక్రోసాఫ్ట్ విలీనం చేసింది. దీంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారంలో పుంజుకుంది. వెబ్ సెర్చ్‌లో గూగుల్ ఆధిపత్యాన్ని సైతం సవాలు చేసేలా కంపెనీ AI విభాగంలో పురోగతి సాధించింది. ఆపిల్ మాత్రం చైనాలో ఆర్థిక పునరుద్ధరణ సవాళ్లను ఎదుర్కొంది. ఇందుకుతోడు Huawei నుంచి పోటీ పెరుగడంతో ఐఫోన్ ఉత్పత్తిపై సవాళ్లను ఎదుర్కొంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications